ఓటేసిన పవన్, ఎన్టీఆర్, చిరు, సినీ తారలు (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణలో బుధవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. హైదరాబాదులోని సంపన్న వర్గాలు ఉండే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో సినీ ప్రముఖులు ఓటు చేయడానికి ఉత్సాహం ప్రదర్శించారు. మెగాస్టార్, కాంగ్రెసు నేత చిరంజీవి సహా ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేయడానికి ఉత్సాహం ప్రదర్శించారు. దర్శకుడు రాజమౌళి, హీరో అల్లు శిరీష్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ తన సతీమణితో కలిసి ఓటేయడానికి వచ్చారు. చాలా మంది సినీ ప్రముఖులు సీమాంధ్రకు చెందినవారే అయినప్పటికీ వారి ఓటు మాత్రం హైదరాబాదులోనే ఉండడం విశేషం. తెలంగాణ రాష్ట్రం తొలి ప్రభుత్వం ఏర్పాటులో వారు కూడా భూమిక పోషిస్తున్నారు.

ఓటేసిన పవర్ స్టార్

ఓటేసిన పవర్ స్టార్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోకసభ, శాసనసభ స్థానాలకు తెలంగాణలో పోలింగ్ జరుగుతోంది.

ఓటేసిన చిరంజీవి

ఓటేసిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి బుధవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటేశారు.

భార్య రమతో కలిసి ఓటేసిన రాజమోళి

భార్య రమతో కలిసి ఓటేసిన రాజమోళి

ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ఆయన భార్య రమ ఓటేసిన తర్వాత చూపుడు వేలికి అంటించిన సిరా గుర్తును చూపిస్తూ ఇలా..

చూపుడు వేలు చూపిస్తూ ఎన్టీఆర్

చూపుడు వేలు చూపిస్తూ ఎన్టీఆర్

ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీప్రణతితో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటేసిన నాగార్జున

ఓటేసిన నాగార్జున

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున తన సతీమణి అమలతో కలిసి వచ్చి ఓటేశారు. ఓటు ప్రాముఖ్యత గురించి ఆయన చెప్పారు.

ఓటేసిన మంచు మనోజ్

ఓటేసిన మంచు మనోజ్

ప్రముఖ నటుడు, మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ హైదరాబాదులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటేసిన హీరో నితిన్

ఓటేసిన హీరో నితిన్

ప్రముఖ సినీ హీరో నితిన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నితిన్ తెలంగాణ ప్రాంతానికి చెందినవారు.

ఓటేసిన తర్వాత మంచు లక్ష్మి

ఓటేసిన తర్వాత మంచు లక్ష్మి

ప్రముఖ నటి, మోహన్ బాబు తనయ మంచు లక్ష్మి ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత చూపుడు వేలును ప్రదర్శిస్తూ ఇలా..

అల్లు శిరీష్ ఇలా..

అల్లు శిరీష్ ఇలా..

నటుడు అల్లు శిరీష్ తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత చూపుడు వేలును ప్రదర్శిస్తూ ఇలా కనిపించారు.

నాగార్జునతో అమల..

నాగార్జునతో అమల..

ఓటు వేసిన తర్వాత తన భార్య అమలతో కలిసి అక్కినేని నాగార్జున ఇలా కనిపించారు. వారు చాలా త్వరగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+