Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్లీజ్ సార్.. ఒక్క చాన్స్ : చంద్రబాబు చుట్టూ ‘గాలి’చక్కర్లు!? మంత్రి పదవి కోసమేనా?

ఎపీ సీఎం చంద్రబాబు ఆశీస్సులతో ఎమ్మెల్సీ సీటు కొట్టేసిన గాలి ముద్దుకృష్ణమనాయుడు మళ్లీ మంత్రి పదవి కోసం ప్రస్తుతం ఆయన చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లు చెప్పుకుంటున్నారు.

అమరావతి: ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవకపోయినా చంద్రబాబు ఆశీస్సులతో ఎమ్మెల్సీ సీటు కొట్టేసిన గాలి ముద్దుకృష్ణమనాయుడు మళ్లీ చంద్రబాబునాయుడి చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం. కారణం - మంత్రి పదవిపై ఆయన ఎప్పటినుంచో ఆశ పెట్టుకోవడమే.

ఇప్పటికే మంత్రిగా పనిచేసిన అనుభవం ముద్దుకృష్ణమనాయుడికి ఉంది. ఎన్టీఆర్ హయాంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ తరువాత ఆయన పార్టీలు మారడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. మళ్లీ తెలుగుదేశంలోకి వచ్చిన తరువాత ఇక అక్కడే స్థిరపడిపోయారు.

Please sir give me one chance : Muddu krishnama naidu request to chandrababu

గత ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసినా చివరికి రోజా దెబ్బతో.. అతి తక్కువ ఓట్ల తేడాతో ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి చవిచూశారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చినా ముద్దుకృష్ణమనాయుడు మాత్రం మంత్రి కాలేకపోయారు.

అయితే కొంతలో కొంత ఓదార్పు ఏమిటంటే.. ఆయన బాధను అర్థం చేసుకుని చంద్రబాబు స్వయంగా పిలిచి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం. అంతే.. ఆ వెంటనే గాలి వర్గీయుల్లో మళ్లీ మంత్రి పదవి ఆశలు ఊపిరిపోసుకున్నాయి. అయితే పార్టీ అధినేత మాత్రం ఆయన కోరికను నెరవేర్చలేదు.

ఇప్పుడు ఏపీలో మళ్లీ మంత్రి పదవుల పందేరం జరగనుంది. ముందుగా తనయుడు లోకేష్ కు మంత్రి పదవి కట్టబెట్టి, ఆ తరువాత ఆశావహుల సంగతి చూడాలనేది చంద్రబాబు మనసులో మాట.

ఈ నేపథ్యంలో మళ్లీ 'గాలి' అమరావతి వైపు మళ్లింది. వారం రోజులుగా ముద్దుకృష్ణమనాయుడు అమరావతి చుట్టూ, చంద్రబాబు చుట్టూ చక్కర్లు కొడుతున్నారని సమాచారం. చంద్రబాబు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి, కనిపించి, తన విషయం గుర్తు చేస్తున్నారని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు.

అయితే పార్టీ కోసం ముద్దుకృష్ణమనాయుడు ముందు నుంచీ సరిగా పనిచేయలేదంటూ చంద్రబాబుకు సంకేతాలు వెళ్లాయని, దీంతో ఈసారి పదవుల పందేరంలో 'గాలి'ని తీసుకోవాలా లేదంటే ఈసారికీ పక్కన పెట్టాలా అన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు కూడా చెప్పకుంటున్నారు. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడి స్థాయిలో ముద్దుకృష్ణమనాయుడు తన వంతు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారని.. దీంతో చంద్రబాబు ఎక్కడున్నా 'గాలి'తగులుతూనే ఉన్నదని చెప్పకుంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+