కేవలం 5 లక్షలకే అదిరిపోయే 3డీ ఇల్లు! ఎల్లుండే భారీ కార్యక్రమం

సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే పేదల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాయి. కాలానికి తగినట్లుగా నిర్మాణ రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ దేశంలోనే తొలిసారిగా అత్యంత ఆధునికమైన '3డీ కాంక్రీట్ ప్రింటింగ్' టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ వేదికగా పరిచయం చేయనున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్‌ 2.0 పథకం కింద రాబోతున్న ఈ సరికొత్త ప్రాజెక్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ అత్యాధునిక 3డీ టెక్నాలజీతో నిర్మించబోయే ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయ రూ.5.10 లక్షలుగా అధికారులు ఖరారు చేశారు. సాధారణంగా పీఎంఏవై పథకం కింద మంజూరయ్యే ఇళ్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.2.39 లక్షల ఆర్థిక సాయం అందిస్తుంటాయి. అయితే, కొత్త టెక్నాలజీని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌‌కు మరింత అదనపు సాయాన్ని అందజేస్తోంది. ఈ బడ్జెట్‌లోనే కేవలం గోడలు, స్లాబ్ మాత్రమే కాకుండా ఇంటి స్థలం అభివృద్ధి, మెట్లు, మరుగుదొడ్డి, ర్యాంప్, షెడ్ వంటి అన్ని మౌలిక వసతులు కల్పించనున్నారు. రూర్కీలోని ప్రఖ్యాత 'సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్' ఈ ప్రాజెక్ట్‌కు సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది.

PM Awas Yojana 2 0 AP Sets A Milestone By Introducing 3D Printed Homes Costing Just 5 Lakhs

కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక చొరవ

ఈ అద్భుతమైన ప్రాజెక్ట్‌ను ఏపీకి రాష్ట్రానికి తీసుకురావడంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించారు. రూర్కీలోని సీబీఆర్‌ఐలో ఇప్పటికే నిర్మించిన కొన్ని ప్రయోగాత్మక 3డీ ఇళ్లను ఆయన స్వయంగా పరిశీలించారు. దేశవ్యాప్తంగా అమలు చేసే ముందు దీనిని తన స్వగ్రామమైన తెనాలి నియోజకవర్గ పరిధిలోని బుర్రిపాలెంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కుదిర్చి అక్టోబర్ 4న అధికారికంగా అవగాహన ఒప్పందం కుదిరేలా చర్యలు తీసుకున్నారు.

దేశంలోనే ఫస్ట్ టైమ్ రోబోటిక్స్‌తో ఇళ్ల నిర్మాణం.. ఏపీలో 3డీ హౌసింగ్ ప్రాజెక్ట్!
దేశంలోనే ఫస్ట్ టైమ్ రోబోటిక్స్‌తో ఇళ్ల నిర్మాణం.. ఏపీలో 3డీ హౌసింగ్ ప్రాజెక్ట్!

బుర్రిపాలెం నుంచి ఓబుల్‌నాయుడుపాలెం వరకు..

ఈ ప్రయోగాత్మక ప్రాజెక్ట్ కింద తొలి విడతగా బుర్రిపాలెంలో 100 ఇళ్లను ఈ నూతన విధానంలో నిర్మించనున్నారు. దీనికి అదనంగా గుంటూరు గ్రామీణ పరిధిలోని ఓబుల్‌నాయుడుపాలెంలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా మరో 77 గృహాలను ఈ టెక్నాలజీతోనే కట్టించి ఇవ్వనున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.13.93 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా కింద రూ.9.44 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4.49 కోట్లను వెచ్చించనున్నారు.

Loans: ఈ లోన్స్ తీసుకుంటే సగం సర్కారే కడుతుంది!
Loans: ఈ లోన్స్ తీసుకుంటే సగం సర్కారే కడుతుంది!

సీఎం చంద్రబాబు సమక్షంలో కీలక ఒప్పందం

అక్టోబర్ 4న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, సీబీఆర్‌ఐ ప్రతినిధుల మధ్య ఈ చారిత్రక ఒప్పందం జరగనుంది. పేదలందరికీ కేవలం ఇళ్లే కాకుండా, అత్యంత నాణ్యమైన, తక్కువ సమయంలో పూర్తయ్యే అత్యాధునిక వసతులను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేస్తున్న ఈ ముందడుగు హౌసింగ్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+