PM Kisan- అన్నదాత సుఖీభవ అర్హుల జాబితా సిద్దం: ఇలా చేస్తేనే, చెక్ చేసుకోండి..!!
PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల జమ పైన బిగ్ అప్డేట్. 24వ విడత నిధుల జమ ముహూర్తం ఖరారు అయింది. వరుస పండుగలు.. ఎల్ నినో కష్టాల వేళ రైతుల ఖాతాల్లో నిధుల జమ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కేంద్రం విడుదల చేస్తున్న పీఎం కిసాన్ నిధులతో కలిపి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. మలి విడత నిధుల విడుదల వేళ రైతులకు కీలక సమాచారం అందిస్తున్నారు.
పీఎం కిసాన్ 24వ విడత నిధుల జమ పైన కేంద్రం సిద్దం అవుతోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతులకు ఏటా రూ.6,000 ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని మూడు విడతలలో పంపిణీ చేస్తున్నారు. ప్రతి విడత రూ.2,000 చొప్పున నేరుగా రైతు బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తారు. ఈ పథకం కింద విడతలు సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదలవుతాయి. చివరి విడత అయిన 23వ విడత జూన్లో విడుదలైంది. దీంతో.. 24వ విడత నిధులు ఈ నెల 30వ తేదీన రైతుల ఖాతాల్లో జమ కానుంది. దేశవ్యాప్తంగా సుమారు 9.34 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.2,000 చొప్పున జమవుతాయి. ఇప్పటికే అధికారిక వెబ్ సైట్ లో అర్హుల జాబితాను ప్రకటించారు. ఈ- కేవైసీ చేసిన వారికి మాత్రమే నిధులు అందుతాయని అధికారులు చెబుతున్నారు.

30వ తేదీన రైతుల ఖాతాల్లో నిధులు
అదే విధంగా రైతులు ఇంకా తమ ఇ-కేవైసీని పూర్తి చేయకపోతే, వారి తదుపరి వాయిదా జమ నిలుపుదల చేసే అవకాశం ఉందని వెల్లడించారు. పీఎం కిసాన్ వాయిదా స్థితిని తెలుసుకోవాలని అనుకుంటే రైతులు ఆన్లైన్లో సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. అదే విధంగా పీఎం కిసాన్ నిధుల జమ సమయంలోనే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను జమ చేయనుంది. గత ఏడాదిన్నార కాలంగా కేంద్ర నిధులతో పాటుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. కేంద్రం ఇచ్చే రూ 6 వేలతో పాటుగా ఏపీ ప్రభుత్వం రూ 14 వేలు అందిస్తోంది. దీని ద్వారా ఏపీలోని రైతులకు వచ్చే నెల అటు కేంద్రం.. ఇటు ఏపీ ప్రభుత్వం అందించే రూ 6 వేలు ఒకే విడత రైతుల ఖాతాల్లో జమ కానుంది.













Click it and Unblock the Notifications
