పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం, తాజా నిర్ణయం..!!
రైతులకు కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బిగ్ అప్డేట్. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ తో పాటుగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. 22వ విడత పీఎం కిసాన్ తో పాటుగా మూడో విడత అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, అంతకు ముందే రైతులకు కీలక సూచన చేసింది. ఇప్పటికే పలు మార్లు సూచించినా.. ఇంకా కొందరు రైతులు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఈ సారి పూర్తి చేసిన వారికే నిధులు అందుతాయని చెబుతున్నారు.
కేంద్రం ప్రతీ ఏటా మూడు విడతలుగా అందిస్తున్న పీఎం కిసాన్ 22వ విడత నిధుల విడుదల పైన ఒక నిర్ణయానికి వచ్చింది. నవంబర్ 19న 21వ విడత నిధులను ప్రధాని విడుదల చేసారు. కాగా.. ఏపీ ప్రభుత్వం ఇదే సమయంలో పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తోంది. ఈ రెండు పథకాల నిధులు ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో రూ 14 వేలు ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. కాగా, 22వ విడత నిధులను తొలుత సంక్రాంతి సమయంలోనే విడుదల చేస్తారని భావించారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 24వ తేదీన ఈ నిధులను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకు 21 విడతల్లో రూ.4 లక్షల కోట్లకు పైగా నిధులు అందించారు.

లెక్కలతో సిద్దమైన ప్రభుత్వం
కాగా, ఏపీలో కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్ తో కలిపి తాము ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు తొలి విడతగా పీఎం కిసాన్ తో కలిపి రెండు విడతల్లో రూ 5 వేలు చొప్పున రూ 10 వేలు రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇక, ఇప్పుడు మూడో విడత నిధులను పీఎం కిసాన్ 22వ విడత తో కలిపి జమ చేయనుంది. మూడో విడతగా ఏపీ ప్రభుత్వం అర్హత పొందిన రైతు ఖాతాల్లో రూ 4 వేలు జమ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్రం ప్రతీ ఏటా మూడు విడతలుగా పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రూ 20 వేలు అన్నదాత సుఖీభవ నిధుల్లో కేంద్రం ఇస్తున్న రూ 6 వేలు మినహాయించి.. మిగిలిన రూ 14 వేలు మూడు విడతలుగా పీఎం కిసాన్ తో పాటుగా అందించాలని నిర్ణయించింది. దీంతో... పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధులు కలిసి ఫిబ్రవరి రైతుల ఖాతాల్లో ఒకే సారి రూ 6 వేలు జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
అంతకంటే ముందు రైతులు.. ఈ- కేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తిచేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులు కామన్ సర్వీస్ సెంటర్లలో బయోమెట్రిక్ ఆధారిత కేవైసీ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ పోర్టల్‌లోనూ ఆధార్ ఓటీపీ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. పీఎం కిసాన్ యాప్‌లో ముఖ గుర్తింపు ద్వారా కూడా కేవైసీ పూర్తిచేయవచ్చు. సంబంధిత స్టేటస్ తెలుసుకునేందుకు.. పీఎం కిసాన్ అధికారిక పోర్టల్‌ను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ ఫార్మర్స్ కార్నర్‌లో కనిపించే Know your statusపై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చాను ఎంటర్ చేస్తే.. ఓటీపీ వస్తుంది. ఓటీపీని నమోదు చేయడం ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అక్కడ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, మండలం, గ్రామం పేర్లను ఎంటర్ చేసి.. గెట్ రిపోర్ట్‌పై క్లిక్ చేయడం ద్వారా లబ్ధిదారుల జాబితాను పొందవచ్చు.
-
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!! -
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో కొత్త లోక్‌సభ నియోజకవర్గాలు..రిజర్వేషన్లు ఇలా - ఆ స్థానాల పునరుద్దరణ, ఇవి రద్దు..!! -
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
వీడ్ని నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు.. 180 మంది బాలికలపై..!! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications