పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల ముహూర్తం : రైతుల ఖాతాల్లో రూ 6 వేలు..!!
రైతులకు కీలక అప్డేట్. పీఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభవ నిధుల విడుదల పైన కీలక సమాచారం అందుతోంది. మరో సారి రెండు పథకాల నిధులు రైతుల ఖాతాల్లో ఒకే సమయంలో జమ కానున్నాయి. 22వ విడత పీఎం కిసాన్ నిధుల పైన కేంద్ర అధికారులు క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి సమయంలో రైతులకు ఈ నిధులు విడుదల చేస్తారని భావించారు. అయితే, ఇప్పుడు ఈ ముహూర్తం పైన స్పష్టత వచ్చింది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనుంది.
కేంద్ర బడ్జెట్ వేళ రైతులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం ప్రతీ ఏటా మూడు విడతలుగా అందిస్తున్న పీఎం కిసాన్ 22వ విడత నిధుల విడుదల పైన ఒక నిర్ణయానికి వచ్చింది. నవంబర్ 19న 21వ విడత నిధులను ప్రధాని విడుదల చేసారు. కాగా.. ఏపీ ప్రభుత్వం ఇదే సమయంలో పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తోంది. ఈ రెండు పథకాల నిధులు ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో రూ 14 వేలు ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి.

కాగా, 22వ విడత నిధులను తొలుత సంక్రాంతి సమయంలోనే విడుదల చేస్తారని భావించారు. అయితే, ఫిబ్రవరి బడ్జెట్ సమయంలోనే విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 1న బడ్జెట్ ఉండే అవకాశం ఉండటంతో.. 14వ తేదీన ఈ నిధులను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకు 21 విడతల్లో రూ.4 లక్షల కోట్లకు పైగా నిధులు అందించారు.
కాగా, ఏపీలో కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్ తో కలిపి తాము ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు తొలి విడతగా పీఎం కిసాన్ తో కలిపి రెండు విడతల్లో రూ 5 వేలు చొప్పున రూ 10 వేలు రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇక, ఇప్పుడు మూడో విడత నిధులను పీఎం కిసాన్ 22వ విడత తో కలిపి జమ చేయనుంది. మూడో విడతగా ఏపీ ప్రభుత్వం అర్హత పొందిన రైతు ఖాతాల్లో రూ 4 వేలు జమ చేయాల్సి ఉంటుంది.
ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్రం ప్రతీ ఏటా మూడు విడతలుగా పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రూ 20 వేలు అన్నదాత సుఖీభవ నిధుల్లో కేంద్రం ఇస్తున్న రూ 6 వేలు మినహాయించి.. మిగిలిన రూ 14 వేలు మూడు విడతలుగా పీఎం కిసాన్ తో పాటుగా అందించాలని నిర్ణయించింది. దీంతో... పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధులు కలిసి ఫిబ్రవరి రైతుల ఖాతాల్లో ఒకే సారి రూ 6 వేలు జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
-
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
అమరావతి ఖర్చు అసలు లెక్క ఇదీ..!! -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్












Click it and Unblock the Notifications