5 ఎకరాల్లోపు రైతులకు మోడీ శుభవార్త.. అకౌంట్‌లోకి రూ.31వేలు

మన భారతదేశంలో దాదాపు 70 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతన సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వస్తుండటంతో వ్యవసాయం చేయడం సులభతరమవుతోంది. గతంలో కూలీలపై ఆధారపడగా, ప్రస్తుతం యంత్రాలే ఆ పనులు చేస్తున్నాయి. కొత్త తరహాలో వ్యవసాయం చేసే రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటునందించడంతోపాటు అవసరమైన మేర రాయితీని కూడా కల్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకంద్వారా అర్హులైన రైతులకు పెట్టుబడి రాయితీ కింద సంవత్సరానికి ఆరువేల రూపాయల సహాయం అందిస్తోంది.

కిసాన్ ఆశీర్వాద్ కింద
కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం ఐదు ఎకరాల్లోపు రైతులకు వారి బ్యాంకు ఖాతాల్లో రూ.25వేలు జమ చేయనుంది. ఎకరాలవారీగా వీటిని విభజించింది. 5 ఎకరాలున్న రైతులకు రూ.25వేలు, 4 ఎకరాలున్న రైతులకు రూ.20వేలు, 2 ఎకరాలున్న రైతులకు రూ.10వేలు వారి వారి ఖాతాల్లో జమచేయనుంది. కేంద్రం కొత్తగా కిసాన్ ఆశీర్వాద్ అనే పథకాన్ని ప్రవేశపెడుతోంది. 5 ఎకరాలున్న రైతుల ఖాతాకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా వచ్చే రూ.6వేలు కలుపుకుంటే మొత్తం రూ.31వేలు అందుకుంటారు.

pm kisan samman nidhi and pm kisan aashirwad scheme details here

17 విడతలుగా పంపిణీ చేశారు
పెట్టుబడి సాయం కింద ఇప్పటివరకు కేంద్రం 17 విడుతలుగా డబ్బులను పంపిణీ చేసింది. 18వ విడత రెండువేల రూపాయలను పంపిణీ చేయాల్సి ఉంది. అక్టోబరు నెలాఖరుకు వీటిని అన్నదాతల ఖాతాల్లో వేస్తారు. ఆయా రైతుల భూమి శిస్తు పన్ను రశీదు, మొబైల్ నెంబరు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, పహాణీ, పాస్ పోర్టు సైజ్ ఫొటోలు కావాలి. తెలంగాణ రాష్ట్రంలో కూడా రైతు భరోసా కింద ఎకరానికి రూ.15వేల చొప్పున అందిస్తున్నారు. గత ప్రభుత్వం రైతు బంధు పథకం పేరుతో రూ.10వేలు అందివ్వగా, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.15వేలు అందిస్తోంది. ఏపీ ప్రభుత్వం కూడా త్వరలోనే అక్కడి రైతులకు ఈ పథకాన్ని అమలు చేయబోతోంది. దీనికి సంబంధించిన విధివిధానాలను అధికారులు రూపొందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+