రంజాన్ మాసం ప్రారంభం - ప్రధాని శుభాకాంక్షలు : తెలుగు రాష్ట్రాల సీఎంలు సైతం..!!
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం అయింది. ఈ రోజు నుంచి ప్రారంభమైన పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రధాని మోదీతో సహా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసం పేదలకు సేవ చేసేలా ప్రజల్లో స్ఫూర్తిని కలిగించాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ ఆకాంక్షించారు. సమాజంలో శాంతి, సామరస్యం, కరుణ పెంపొందాలని ప్రధాని పిలుపునిచ్చారు.
ముస్లింలంతా ఉపవాస దీక్షలు ప్రారంభించారు. శనివారం సాయంత్రం చంద్రుడు కనిపించాడని, ఆదివారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయని ఫతేపుర్ మసీదు ఇమామ్ ముప్తీ ముఖర్రం అహ్మద్ తెలిపారు.

రంజాన్ దీక్షలు ప్రారంభం
ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బంగాల్ వంటి రాష్ట్రాల్లోని వివిధ ఇస్లాం సంస్థలు కూడా రంజాన్ మాసం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. దీంతో మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తి చేసారు. రంజాన్ మాసంలో ముస్లిం భక్తిశ్రద్దలతో నెలరోజులపాటు కఠోర దీక్షతో ఉపవాసాలు ఉంటారు. తెల్లవారుజామున 4 గంటల 46 నిమిషాలకు సహర్‌తో ప్రారంభమై.. సాయంత్రం 6 గంటల 34 నిమిషాలకు ఇఫ్తార్‌తో ఉపవాస దీక్ష ముగుస్తుంది. మళ్లీ ఇదే విధంగా.. సమయంలో కొద్దిపాటి మార్పులతో నెలరోజులపాటు దీక్షను పాటిస్తారు.

ప్రధాని .. తెలుగు సీఎంల గ్రీటింగ్స్
రంజాన్ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. నెల రోజులపాటు సాయంత్రం 4 గంటలకే విధులు ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలు నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

ఉద్యోగులకు మినహాయింపు
తెలంగాణకు ప్రత్యేకమైన 'గంగజమునా తెహజీబ్' సంస్కృతి మరింత పరిఢవిల్లాలని, రంజాన్ పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని అభిలషించారు. అదే విధంగా.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ సైతం ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు నియమ..నిష్ఠలతో కఠిన ఉపవాస దీక్ష ఆచరించే ఈ పుణ్య రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదిగా పేర్కొన్నారు. ఉపవాస దీక్షలు ఆచరించబోతున్న ప్రతీ ఒక్కరికీ అల్లా దయతో అంతా మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.
-
Noida jinx: అక్కడికి వెళ్తే పదవి పోయినట్లేనా ? సెంటిమెంట్ పై మోడీ కామెంట్స్..! -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!!












Click it and Unblock the Notifications