విభజన హామీ నెరవేరుస్తాం: బాబుతో మోడీ, నిరాశే.. ప్రత్యేక హోదాపై జైట్లీ షాక్

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ ముగిసింది. ఈ భేటీ గంటకు పైగా సాగింది. అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీలు విలేకరులతో మాట్లాడారు. ఈ భేటీలో జైట్లీ, యనమల రామకృష్ణుడు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

విభజన చట్టంలోని అన్ని హామీలను నెరవేరుస్తామని ప్రధాని మోడీ చెప్పారని అరుణ్ జైట్లీ చెప్పారు. ప్రధానితో భేటీలో విస్తృతంగా చర్చలు జరిగాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. విభజన చట్టం అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. చట్టం అమలుపై రోడ్ మ్యాప్ ప్రకటిస్తామన్నారు.

ప్రత్యేక హోదా అంశం ప్రస్తుతం మా చర్చల్లో ఉందని చెప్పారు. విభజన చట్టంలోని 46, 90, 94ల పైన ప్రధానంగా చర్చించామని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు కొనసాగుతుందన్నారు. నీతి అయోగ్ అధికారులు, ఏపీ ప్రభుత్వం అధికారులు విభజన హామీల రోడ్ మ్యాప్ పైన కసరత్తు చేస్తారన్నారు.

విభజన హామీల విషయంలో రోడ్ మ్యాప్ తయారు చేయాలని ప్రధాని మోడీ నీతి అయోగ్‌ను ఆదేశించారని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడలేదు. విలేకరులు కోరగా తాను తర్వాత మాట్లాడుతానని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీతో జరిగిన భేటీలో చంద్రబాబు నివేదికలు అందజేశారు.

కాగా, అంతకుముందు వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాకు జాతీయ అభివృద్ధి మండలి, ప్రణాళిక సంఘం ఆమోదం లేదని చెప్పారు. వీటి ఆమోదం కావాలంటే మిగిలిన 9 రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా అడుగుతున్నాయన్నారు.

PM Modi assures to AP CM Chandrababu

14 ఆర్థిక సంఘం సిఫార్సులతో సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. ఏపీ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ సమస్య ఒక్క రోజులో పరిష్కారం అయ్యేది కాదని, దీనిని రాజకీయం చేయవద్దన్నారు.

ఇదిలా ఉండగా.. విభజన హామీలు నెరవేరుస్తామని ప్రధాని మోడీ ఏపీ సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చారు. అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా పైన చర్చలు సాగుతున్నాయన్నారు. విభజన చట్టంలో లేని ప్రత్యేక హోదా విషయంలో ఎలాంటి హామీ రాలేదని తెలుస్తోంది. విభజన చట్టం హామీలు నెరవేర్చుతామని చెప్పారు తప్పితే చట్టంలో లేని హోదా గురించి బాబుకు భరోసా ఇవ్వలేదని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+