జగన్ కు ప్రధాని బర్త్ డే విషెస్: గవర్నర్..కేంద్ర మంత్రి గడ్కరీ సైతం: కేక్ కట్ చేసిన సీఎం..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి అయిన తరువాత జరుపుకుంటున్న తొలి జన్మదినం కావటంతో..ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేసారు. ఆయురారోగ్యాలతో చిరకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సీఎం జగన్‌కు విషెష్‌ చెబుతూ ట్వీట్ చేసారు. అదే విధంగా గవర్నర్ బీబీ హరిచందన్ ఫోన్ ద్వారా ముఖ్యమంత్రికి పుట్టిన రోజు విషెస్ చెప్పారు.

కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ట్విటర్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక, సీఎం జగన్ తన పుట్టిన రోజును ధర్మవరంలో చేనేత కార్మికుల మధ్య జరుపుకుంటానని గతంలోనే చెప్పారు. ఆయన కాసేపట్లో అక్కడికి చేరుకోనున్నారు. సీఎం కార్యాలయంలో జగన్ అధికారులు..మంత్రుల సమక్షంలో కేక్ కట్ చేసారు.

Pm Modi birth day wished to CM jagan by twitter

ముఖ్యమంత్రి జగన్ జన్మదినం కావటంతో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి .. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో ని పార్టీ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించారు. ఇక, ముఖ్యమంత్రి జగన్ తన జన్మదినం నాడు అనంతపురం జిల్లా లో వైయస్సార్ చేనేత పధకం అమలుకు కాసేపట్లో శ్రీకారం చుట్టనున్నారు. తన జన్మదినం సందర్భంగా నవరత్నాల్లో ప్రకటించిన వైయస్సార్ చేనేత హస్తం ప్రారంభించనున్నారు. వారి మధ్య జన్మదిన వేడుకలను నిర్వహించనున్నారు. ఇక, ముఖ్యమంత్రి నివాసంలో మంత్రులు..అధికారులు సీఎం ను కలిసి విషెస్ చెప్పారు. సీఎం కేక్ కట్ చేసారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి..డీజపీ సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Pm Modi birth day wished to CM jagan by twitter

ఇక, ముఖ్యమంత్రి తన జన్మదినం సందర్బంగా విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ హోదా కల్పించారంటూ అక్కడ వైసీపీ నేతలు సంబరాలు చేస్తున్నారు. ఇదే సమయంలో అమరావతిలో జరుగుతన్న నిరసనల మీద టీడీపీ నేతలు స్పందించారు. జగన్ తన జన్మదినం సందర్బంగా అమరావతి ప్రజలకు రాజధాని మారుస్తూ వరం ఇచ్చారని ఎద్దేవా చేస్తున్నారు. ఇక, అనంతపురం.. కడప జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల్లో సీఎం జగన్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+