పవన్ నివాసానికి ప్రధాని మోదీ - పరామర్శ..!?
తెలుగు రాజకీయాల్లో మరో అనూహ్య పరిణామం. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన వేళ కీలక సన్నివేశం చోటు చేసుకోనుంది. కొద్ది రోజుల క్రితం అస్వస్థతకు గురైన పవన్.. సర్జరీ తరువాత విశ్రాంతిలో ఉన్నారు. హైదరాబాద్ పర్యటనకు వస్తున్న ప్రధాని.. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న పవన్ ను ఆయన నివాసంలో కలవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ నేతల కు ప్రాధమికంగా సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో చిరంజీవి సహా మెగా ఫ్యామిలీ పవన్ ఇంటికి రానుంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొద్ది రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. సర్జరీ తరువాత ప్రస్తుతం హైదరాబాద్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ ఆరోగ్యం పైన ఇప్పటికే ప్రధాని మోదీ స్పందించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గత వారం సీఎం చంద్రబాబు హైదరాబాద్ లో పవన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. వైద్యులు చెప్పిన విధంగా జాగ్రత్తలు తీసుకో వాలని సూచించారు. క్రమేణా కోలుకుంటున్న పవన్.. వచ్చే వారం తిరిగి అధికారిక విధుల్లో చేరే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ తమ కూటమి భాగస్వామి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను స్వయంగా పరామర్శించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా పవన్ ఇంటికి మోదీ వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.

హైదరాబాద్ లో పవన్ కు ప్రధాని పరామర్శ
హైదరాబాద్ లో ప్రధాని మోదీ దాదాపు రూ 9,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకు స్థాపనలు .. ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆ తరువాత పేరెడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఈ పర్యటన ద్వారా తెలంగాణలో వచ్చే ఎన్నికల కోసం పార్టీని సమాయత్తం చేసే విధంగా ప్రణాళికల ను సిద్దం చేస్తున్నారు. ఈ సమయంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కు కూటమిలో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక.. ఇప్పుడు పవన్ అస్వస్థతకు గురైన సమయంలో హైదరాబాద్ కు వస్తున్న వేళ.. పరామర్శకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. జనసేన నేతలు ప్రధాని తమ అధినేత ఇంటికి వస్తుండటంతో.. అక్కడకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మెగా కుటుంబ సభ్యులు సైతం పవన్ ఇంటికి చేరుకుంటారని తెలుస్తోంది. చివరి నిమిషంలో మార్పులు జరిగితే మినహా.. ప్రధాని తన పర్యటనలో పవన్ ను పరామర్శించే అవకాశం ఉందని సమాచారం.












Click it and Unblock the Notifications