ఏపీకి ప్రధాని మోదీ -ప్రత్యేక సమావేశం..!?
ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు రానున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రధాని..ఇప్పుడు ఏపీ పర్యటనకు వస్తున్నట్లు సమాచారం. వికసిత్ భారత్ పేరుతో ప్రధాని విజన్ కు కొనసాగింపు గా ఏపీలో చంద్రబాబు వికసిత్ ఏపీ 2047 పేరుతో విజన్ ను ప్రకటించేందుకు సిద్దం అయ్యారు. ఈ విజన్ ను ప్రధాని చేతుల మీదుగా ఆవిష్కరించాలని భావిస్తున్నారు. ఇక..వికసిత్ ఏపీ చర్చల కోసం ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది.
వికసిత్ ఏపీ
ముఖ్యమంత్రి చంద్రబాబు వికసిత్ ఏపీ 2047 విజన్ పైన కసరత్తు చేస్తున్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను రెండు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంగా విజన్ ను ఆవిష్కరించనున్నారు. అదే విధంగా జీఎస్డీపీ 15 శాతం లక్ష్యంగా నిర్ణయించనున్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ అమలు స్పూర్తితో రాష్ట్రంలో ఈ విజన్ దిశగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. వికసిత్ ఏపీ 2047 విజన్ ఆవిష్కరణ కోసం ప్రధాని మోదీ అక్టోబర్ 2న చంద్రబాబు ఆహ్వానం మేరకు ఏపీకి వస్తున్నట్లు తెలుస్తోంది.

కసరత్తు
వికసిత్ ఎపి విజన్ 2047లో భాగంగా శాసనసభ్యులకు అవగాహన కల్పించేందుకు అక్టోబర్‌లో ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అలాగే గాంధీ జయంతి రోజున వికసిత్ ఎపి విజన్ 2047ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగానే ముందుగా 2024-29 మధ్య కాలంలో వికసిత్ ఆరధ్రా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే జిల్లాల ముఖ్య ప్రణాళికాధికారులకు శిక్షణ ఇవ్వగా, మంత్రులు, పార్లమెరట్ సభ్యులకు కూడా కొద్ది రోజుల్లోనే శిక్షణ ఇవ్వనున్నారు.
ప్రత్యేక సమావేశం
ఇదే సమయంలో అక్టోబర్ ఐదో తేదీ నుంచి 10వ తేదీ మధ్య కాలంలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయించారు. సూచన ప్రాయంగా ఈ తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సమావేశాల్లోనే వార్షిక పూర్తిస్థాయి బడ్జెట్‌ను కూడా ఆమోదిరచుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. వాస్తవానికి నవంబర్ నెలాఖరులోగా బడ్జెట్‌ను ఆమోదించుకునేరదుకు సమయం ఉన్నప్పటికీ అక్టోబర్‌లోనే బడ్జెట్ ప్రవేశపెట్టి అదే సమయంలో విజన్ అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications