PM Modi : కందుకూరు ఘటనపై మోడీ దిగ్భ్రాంతి -2 లక్షల PMNRF సాయం-ఏమన్నారంటే ?
నెల్లూరు జిల్లా కందుకూరులో నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుని 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రధాని మోడీ కూడా దీనిపై స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ,నెల్లూరు బహిరంగ సభలో జరిగిన దుర్ఘటనవల్ల తీవ్రంగా కలత చెందాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను: పిఎం @narendramodi
— PMO India (@PMOIndia) December 29, 2022
కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో 8 మంది అక్కడికక్కడే చనిపోయిన ఘటనపై స్పందించిన ప్రధాని మోడీ ఇవాళ ట్వీట్ చేశారు. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ,నెల్లూరు బహిరంగ సభలో జరిగిన దుర్ఘటనవల్ల తీవ్రంగా కలత చెందాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ మోడీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. తెలుగువారికి అర్దమయ్యేలా ప్రధాని మోడీ కార్యాలయం తెలుగులోనే ఈ ట్వీట్ చేసింది.

అలాగే మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ పరిహారం కూడా ప్రకటించారు. పిఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి మృతుల కుటుంబసభ్యులకు రూ.2 లక్షలు,క్షతగాత్రులకు రూ. 50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా మంజూరు చేస్తామని ప్రధాని మోడీ తన రెండో ట్వీట్ లో పేర్కొన్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. దానికి అదనంగా ప్రధాని మోడీ ప్రకటించిన సాయం కూడా మృతుల కుటుంబాలకు అందనుంది.
పిఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి మృతుల కుటుంబసభ్యులకు రూ.2 లక్షలు,క్షతగాత్రులకు రూ. 50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా మంజూరు చేస్తాం : పిఎం @narendramodi
— PMO India (@PMOIndia) December 29, 2022












Click it and Unblock the Notifications