ఏపీలో రూ లక్ష కోట్ల ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన- ముహూర్తం ఫిక్స్..!!

ఏపీలో మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దాదాపు రూ లక్ష కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు ఏర్పాటుకు నిర్ణయించారు. ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖరారైంది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు కార్యరూపం దాల్చ నుంది. డిసెంబర్ లో ప్రధాని మోదీ తిరుపతి పర్యటన ఖరారైంది. ఆ సమయంలోనే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఏపీలో బీపీసీఎల్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ.. పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణానికి కీలక నిర్ణయం తీసుకు న్నారు. దాదాపుగా రూ లక్ష కోట్ల పెట్టుబడితో ప్రకాశం జిల్లా రామాయపట్నం వద్ద ఈ ప్రాజెక్టు రానుంది. ఈ ప్రాజెక్టుకు డిసెంబరు 5న శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు. డిసెంబరు 4 నుంచి 6వ తేదీ వరకూ తిరుపతిలోని ఐసర్‌ వేదికగా జరగనున్న అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీపీల వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని షెడ్యూల్ ఖరారైంది. తొలి రెండు రోజులు ఈ కాన్ఫరెన్స్‌లో ప్రధాని పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఏపీకి వస్తున్న ఈ సమయంలో నే రామాయపట్నం పోర్టు సమీపంలో 5,200 ఎకరాల్లో బీపీసీఎల్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి బీపీసీఎల్‌కు భూములు అప్పగించింది.

pm-modi-to-lay-foundation-stone-for-bpcl-greenfield-refinery-in-andhra-pradesh-on-december-5

వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలు పెట్టాలన్న యోచనలో బీపీసీఎల్‌ యాజమాన్యం ఉంది. ప్రాజెక్ట్‌ ఏర్పాటు కోసం బీపీసీఎల్‌ కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకోగా, ఇటీవల ఎక్స్‌పర్ట్‌ కమిటీ కూడా ఎటువంటి అభ్యంతరాలు లేవని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. అనుమతులు రావల్సి ఉంది.

కాగా.. ఈ ప్రాజెక్టు ద్వారా సంవత్సరానికి 9 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ రిఫైనరీ, పెట్రో కమికల్‌ కాంప్లెక్స్‌లో పెట్రోల్‌, డీజిల్‌, ఏవియేషన్‌ ఫ్యూయల్‌, నాఫ్తా, ఎల్‌పీజీ, బిటుమినస్‌ వంటి వాటిని ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయ్యాక ప్రత్యక్షంగా 1,250 మందికి, పరోక్షంగా 3,750 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రధాని రాక పైన ఈ రోజు లేదా రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+