'సీమ'కు ప్రధాని మోదీ రాక వేళ కీలక నిర్ణయం..!!
ఏపీ కేంద్రంగా రాజకీయ సమీకరణాలు ఆసక్తి కరంగా మారాయి. కూటమి ప్రభుత్వం కొత్త వ్యూహాల తో ముందుకు వెళ్తోంది. ప్రభుత్వం లక్ష్యంగా వైసీపీ పోరుబాట కొనసాగిస్తోంది. రాజకీయంగా ఏపీ లో మారుతున్న లెక్కల వేళ బీజేపీ నాయకత్వం రాష్ట్రం పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. రాయలసీమ లో జరిగే ఈ పర్యటన వేళ కూటమి నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఎన్డీఏ బలం చాటేందుకు సిద్దమయ్యారు.
ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. ఈ నెల 16న ప్రధాని మోదీ ఏపీలో పర్యటించనున్నారు. ఈ మేరకు మోదీ పర్యటన వివరాలను శాసనమండలి లాబీలో సహచర మంత్రులు, ఎమ్మెల్సీల కు మంత్రి లోకేష్ వివరించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోదీ పర్యటించనున్నారు. శ్రీశైలం లోని మల్లిఖార్జున స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన వేళ ఏపీ లోని కూటమి నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలకు ఏపీ శాసనసభ ప్రత్యేకంగా చర్చించి.. ఆమోదించింది. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ సంస్కరణల పైన కార్యక్రమాల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

కాగా, ఇప్పుడు ప్రధాని మోదీ ఏపీకి వస్తున్న వేళ జీఎస్టీ సంస్కరణల పై కర్నూల్ లో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. అదే సమయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన లు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు.. కార్యక్రమాల పైన కసరత్తు మొదలు పెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 17 నెలల పాలన పూర్తవుతున్న వేళ.. ఏపీలో ప్రధాని మోదీ పర్యటన పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది. అటు బీహార్ ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా పెంచుతున్నాయి. అయితే, ప్రధాని ఏపీ పర్యటన వేళ.. ఏపీకి సంబంధించిన అంశాలను ప్రస్తావించాలని భావిస్తున్నారు. అమరావతి రాజధాని పనులతో పాటుగా.. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రధానికి వివరించే అవకాశం ఉంది. సీమ కేంద్రంగా ప్రధాని మోదీ ర్యాలీని సక్సెస్ చేసి కూటమి బలం చాటుకునే విధంగా ఏర్పాట్లకు కూటమి నేతలు సిద్దం అవుతున్నారు.












Click it and Unblock the Notifications