చంద్రబాబు, పవన్ నివాసాలకు మోదీ- చిరంజీవికి పిలుపు..అనూహ్య నిర్ణయం..!!
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన వేళ ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మోదీ తన పర్యటనలో భాగంగా ఎన్డీఏ మిత్రపక్షాలు టీడీపీ - జనసేన అధినేతల నివాసాలకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. పవన్ అస్వస్థతకు గురై కోలుకుంటున్నారు. దీంతో.. పవన్ ను పరామర్శించాల ని నిర్ణయించారు. అదే సమయంలో చంద్రబాబు ఇంటికి వెళ్లనున్నారు. చిరంజీవి సైతం ప్రత్యేకం గా మోదీని కలవనున్నారు. ఈ సమావేశాల వేళ అనూహ్య నిర్ణయం తీసుకునే అవకాశం ఉండే అవకాశం కనిపిస్తోంది.
ప్రధాని మోదీ హైదారబాద్ పర్యటన ఆసక్తిని పెంచుతోంది. అటు తెలంగాణ రాజకీయాల్లో మోదీ పర్యటన పైన అంచనాలు పెరుగుతున్నాయి. కాగా.. ఈ పర్యటనలో ప్రధాని మోదీ హైదరాబాద్ లో ఏపీ సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ నివాసాలకు వెళ్లనున్నారు. కొద్ది రోజుల క్రితం పవన్ అస్వస్థతకు గురై సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం కోలుకన్నారు. పవన్ ను ప్రధాని మోదీ వ్యక్తి గతంగా పరామర్శించేందుకు ఆయన నివాసానికి వస్తున్నారు. పవన్ తో భేటీ వేళ మెగా స్టార్ చిరంజీవి హాజరు కానున్నారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు సమయం నుంచి మెగా బ్రదర్స్ పైన ప్రధాని మోదీ ప్రత్యేక అభిమానం చూపిస్తున్నారు. చిరంజీవికి రాజకీయంగా కీలక బాధ్యతలు అప్పగించాలని చాలా కాలంగా బీజేపీ నాయకత్వం ఆలోచన చేస్తోంది. చిరంజీవి అందకు అంగీకరించక లేదు. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో రాజకీయం ఆసక్తి కరంగా మారుతున్న వేళ.. వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు నివాసానికి ప్రధాని మోదీ వెళ్లనున్నారు. జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి సాయంత్రం 4.40 గంటలకు చేరుకుంటారు. ఈ ఇద్దరు నేతలు ప్రత్యేకంగా భేటీ కానుండటం రాజకీయవర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.

భవిష్యత్ కోసం వ్యూహాత్మక నిర్ణయాలు
తెలంగాణలో ఎన్డీఏ కూటమి ఏర్పాటు ఉంటుందనే ప్రచారం వేళ ఈ భేటీ కీలకంగా మారుతోంది. త్వరలో గ్రేటర్ హైదరాబాద ఎన్నికలు జరగనున్నాయి. వీటి పైన బీజేపీ భారీ అంచనాలతో ఉంది. అదే విధంగా 2028 లో తెలంగాణలో అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమం లో ఇప్పటికీ ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి పెద్దసంఖ్యలో అభిమానులున్నారు. ఈ భేటీలో ఏపీ రాజకీయ, ప్రభుత్వ వ్యవహారాలు కూడా ఈ భేటీలో చర్చకు రానున్నాయి. బీజేపీ, టీడీపీ పొత్తు సంగతి ఎలా ఉన్నా చంద్రబాబుతో ప్రధాని మోదీ భేటీ వ్యూహాత్మకంగా కనిపిస్తోంది. ఏపీలో మాదిరిగా తెలంగాణలో కూడా బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి పైనా ప్రచారం ఉన్నా... పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. చంద్రబాబు నివాసం నుంచి ప్రధాని నేరుగా మాదాపూర్‌లోని పవన్ నివాసానికి వెళ్లనున్నారని పార్టీవర్గాలు తెలిపాయి. వీరిద్దరి నివాసాలకు వెళ్లటం ద్వారా ప్రధాని మోదీ కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారనే విశ్లేషణలు మొదలయ్యాయి. దీంతో.. ఈ భేటీల వేళ జరిగే చర్చలు... భవిష్యత్ లో చోటు చేసుకొనే పరిణామాల పైన ఆసక్తి నెలకొంది.













Click it and Unblock the Notifications