మోడీ సంక్రాంతి గ్రీటింగ్స్: హెచ్చరికలు బేఖాతరు.. కోడి పందాలు, లక్షల్లో బెట్టింగ్స్!
విజయవాడ/ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. 'మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు' అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
समस्त देशवासियों को मकर संक्रांति की हार्दिक शुभकामनाएं! On Makar Sankranti, I extend my heartfelt greetings to people across the nation.
— Narendra Modi (@narendramodi) January 14, 2016 జోరుగా పొట్టేళ్ల, కోడి పందాలు
ఏపీలో జోరుగా కోడి పందాలు సాగుతున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కోడి పందాలు నిషేధించామని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిక పోస్టర్లు అంటించారు. అయినప్పటికీ గోదావరి, కృష్ణా జిల్లాల్లో జోరుగా పందాలు సాగుతున్నాయి.
పోలీస్ హెచ్చరికలు ఏమాత్రం పని చేయలేదు. ఈ పందాల్లో ప్రజాప్రతినిధులు, టాలీవుడ్ నిర్మాతలు కూడా పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ బెట్టింగ్‌లలో లక్షలు చేతులు మారుతున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పొట్టేళ్ల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు.

కాగా, కోడి పందేలను అడ్డుకుంటామని పోలీసులు చెప్పినా, సంక్రాతి సంప్రదాయాలు కొనసాగిస్తామంటూ కోడి పందేలు నిర్వాహకులు పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో సంప్రదాయ క్రీడల పేరుతో బుధవారానికే భారీగా బరులు సిద్ధం చేశారు.
భోగి, సంక్రాంతి, కనుమ మూడురోజులూ ఏదోఒక పద్ధతిలో భారీగా కోడిపందేలు జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఏ ప్రాంతాల్లో కోడిపందేలు జరిగినా దానికి సంబంధిత స్టేషన్ ఎస్సై బాధ్యత వహించాల్సి ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు హుకుం జారీ చేయడంతో పోలీసుల్లో కూడా అలజడి రేగింది.
తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, కోర్టు, మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు మాత్రమే అమలు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. కోడిపందేలను అడ్డుకోవడానికి ఇప్పటికే ప్రత్యేక బృందాలను తయారు చేశారు. అయినప్పటికీ గుట్టుగా సాగుతున్నాయని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications