'శుభకార్యం టైంలో జగన్ దీక్ష, 3నెలల్లో జైలుకే': మోడీ 'అమరావతి' షెడ్యూల్ ఇదీ...

గుంటూరు: ఓ వైపు అమరావతికి శంకుస్థాపన ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా అంటూ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ దీక్ష చేయడంపై మంత్రులు మండిపడుతున్నారు. శుభకార్యం సమయంలో జగన్ దీక్ష విడ్డూరమని, ఆయన మూడు నెలల్లో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.

మంత్రి పి నారాయణ మాట్లాడుతూ... ఏపీలో రాష్ట్ర పండుగ, శుభాకార్యం సమయంలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష చేయడం విడ్డూరమని మండిపడ్డారు. జగన్ అందరికీ భిన్న వైఖరితో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ... జగన్ మూడు నెలల్లో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లు ఇస్తుంటే జగన్ అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. నదుల అనుసంధానం ఘనత ఏపీ సీఎం చంద్రబాబుదే అన్నారు.

PM Narandra Modi Amaravati visit: Full schedule

అమరావతి శంకుస్థాపనకు ప్రధాని: పర్యటన వివరాలు ఇవీ..

రాజధాని అమరావతి శంకుస్థాపనకు రానున్న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఖరారైంది. మోడీ ఈ నెల 22వ తేదీన శంకుస్థాపన కార్యక్రమంలో 11.45 నిమిషాల నుంచి 2.30 గంటల వరకు ఉంటారు.

మోడీ మధ్యాహ్నం 11.45 నిమిషాలకు గన్నవరం చేరుకుంటారు
గం.11.55 నిమిషాలకు అమరావతికి బయలుదేరుతారు
గం.12.15 నిమిషాలకు అమరావతి చేరుకుంటారు
గం.12.35 నిమిషాలకు శంకుస్థాపన వద్ద పూజ.
గం.12.45 నిమిషాలకు మా తెలుగు తల్లి గీతాలాపన
గం.12.50 నిమిషాలకు ప్రధాని మోడీకి ప్రముఖుల పుష్పగుచ్చాలు ఇచ్చే కార్యక్రమం
గం.12.55 నిమిషాలకు అమరావతిపై లఘు చిత్రం
ఆ తర్వాత వేలాదిగా బెలూన్ల ఎగరవేత, ప్రధానికి జ్ఞాపిక ఇస్తారు
గం.1.00 రైతు వందనం - నృత్యరూపకం
గం.1.10 నిమిషాలకు కూచిపూడి నృత్యం.
గం.1.20 నిమిషాలకు చంద్రబాబు అధ్యక్షతన ఉపన్యాసం
అనంతరం సింగపూర్, జపాన్ ప్రతినిధుల ప్రసంగాలు
ఆ తర్వాత ప్రధాని మోడీ, కేంద్రమంత్రుల ప్రసంగాలు
గం.2.00 నిమిషాలకు అమరావతి గీతాలాపన
గం.2.10 నిమిషాలకు జాతీయ గీతాలాపన, మధ్యాహ్న భోజనం
గం.2.45 నిమిషాలకు అమరావతి నుంచి బయలుదేరాతారు
గం.3.05 నిమిషాలకు గన్నవరం చేరుకుంటారు
గం.3.10 నిమిషాలకు తిరుపతికి బయలుదేరాతారు.
గం.4.05 నిమిషాలకు తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు
గం.4.30నిమిషాలకు తిరుపతి నుంచి తిరుమల ప్రయాణం
గం.5.25 నిమిషాలకు తిరుమల చేరుకుంటారు
శ్రీవారిని దర్శించుకుంటారు
గం.6.30 నిమిషాలకు తిరుమల నుంచి తిరుపతికి వస్తారు
గం.7.30 నిమిషాలకు తిరుపతి నుంచి ఢిల్లీ తిరుగు ప్రయాణం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+