HBD YSJagan: జగన్ అభిమానుల దెబ్బకు సోషల్ మీడియా షేకింగ్..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ జన్మదినం ఈ రోజు. ప్రధాని మోదీతో సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పార్టీ నేతలు..అభిమానులు విషెస్ తో హోరెత్తిస్తున్నారు. పార్టీ కేడర్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జగన్ తన జన్మదినం నాడు విద్యార్దులకు ట్యాబ్ లు పంపిణీ చేయనున్నారు. చింతపల్లిలో జరిగే కార్యక్రమంలో జగన్ పాల్గొంటున్నారు. ఎన్నికల వేళ జగన్ బర్త్ డే వినూత్నంగా నిర్వహించే పార్టీ శ్రేణులు సిద్దమయ్యాయి.
సీఎం జగన్ జన్మదినం వేళ ప్రధాని మోదీ విషెస్ చెప్పారు. ప్రధాని మెదీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యంగా దీర్ఘాయుష్షుతో ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. పలువురు ప్రముఖులు జగన్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు. మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు విషెస్ చెప్పారు. పార్టీ నేత సాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని, మరెన్నో సంతోషకరమైన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటున్నా...అంటూ పోస్టు చేసారు. మంత్రులు రోజా, అంబటి రాంబాబు ట్వీట్ల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
Birthday wishes to Andhra Pradesh CM Shri @ysjagan Garu. May he lead a long and healthy life.
— Narendra Modi (@narendramodi) December 21, 2023
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని, మరెన్నో సంతోషకరమైన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటున్నా. pic.twitter.com/q8RhHafAi4
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 21, 2023
సంక్షేమ సామ్రాట్ మా జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు 🎂#HBDJagananna pic.twitter.com/mY3WG5Tr2d
— Roja Selvamani (@RojaSelvamaniRK) December 20, 2023
ట్విటర్ డౌన్
ముఖ్యమంత్రి జగన్ కు సోషల్ మీడియా వేదికగా విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా షేక్ అవుతోంది. జగన్ రాజకీయ జీవితంలో కీలక ఘట్టాలను వీడియోలుగా తయారు చేసిన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తున్నారు. పలువురు నేతలు కార్యకర్తలు, అభిమానులు లక్షల్లో జగన్ గారికి #HBDYSJagan తో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.. ఒకేసారి ఇంత మంది యాక్టివేట్ అవ్వడంతో ట్విట్టర్ సర్వర్ డౌన్ అయ్యింది. ఇప్పటికే మూడు లక్షలకు పైగా ట్వీట్లు పోస్టయ్యాయి. జాతీయ స్థాయిలో తొలి స్థానంలో ట్రెండ్ అవుతోంది.
ముఖ్యమంత్రి జన్మదినం కావటంతో ఆయన అభిమానులు..వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రక్త దానం.. సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ను సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. ముఖ్యమంత్రిని వేద పండితులు ఆశీర్వదించారు. ఇక, సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి జగన్ విషెస్ హోరెత్తుతున్నాయి.
#HBD YSJagan టాగ్ లో ట్విట్టర్ హోరెత్తుతోంది.పార్టీ నేతలు నియోజవర్గాల్లో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సీఎం జగన్ అల్లూరి జిల్లా చేరుకోనున్నారు. అక్కడ 8వ తరగతి విద్యార్ధులకు ఉచిత ట్యాబ్ లు పంపిణీ సీఎం ప్రారంభించనున్నారు. బైజూస్ కంటెంట్ తో పాటుగా ఈ టాబ్ లను అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications