విజయవాడ వైభవానికి మోదీ జైజైలు.. "దుర్గమ్మ ఆశీస్సులు, కృష్ణా నది వారసత్వం.."

ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవానికి, చారిత్రక ప్రాధాన్యతకు నిలువెత్తు రూపమైన బెజవాడ గడ్డపై దసరా నవరాత్రుల సందర్భంగా అత్యంత వైభవంగా జరుగుతున్న 'విజయవాడ ఉత్సవ్ 2.0' సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ అద్భుత వేడుకల ప్రారంభం పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ చొరవను, విజయవాడ ప్రజల ఘనమైన సంప్రదాయాన్ని కొనియాడుతూ ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఒక లేఖను విడుదల చేశారు. ఈ వేడుకలు కేవలం సాంస్కృతిక ప్రదర్శనలకే పరిమితం కాకుండా, ప్రాంతీయ కళాకారులకు, పారిశ్రామికవేత్తలకు నూతన ఉపాధి అవకాశాలను అందిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా విజయవాడ

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక , ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడ నగరం అత్యంత విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉందని ప్రధాని మోదీ తన లేఖలో ప్రశంసించారు. పవిత్రమైన కృష్ణా నది పరవళ్లు తొక్కుతున్న ఈ గడ్డపై, భక్తుల కొంగుబంగారమైన కనకదుర్గమ్మ ఆలయం వెలసి ఉండటం ఈ నగరానికి గొప్ప చారిత్రక వారసత్వాన్ని తెచ్చిపెట్టిందని ఆయన పేర్కొన్నారు. ఒక నగరంలోని ప్రజలు తమ ప్రాచీన సంప్రదాయాలతో మమేకమై వాటిని భవిష్యత్ తరాలకు అందించినప్పుడే ఆ ప్రాంత సంస్కృతి సజీవంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

PM Narendra Modi Praises Vijayawada Utsav 2 0 Writes Special Letter to CM Chandrababu Naidu
Dasara 2026: బాలా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ దర్శనం! ఈ పూజలు చేస్తే కోరిన కోరికలు సిద్ధి
Dasara 2026: బాలా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ దర్శనం! ఈ పూజలు చేస్తే కోరిన కోరికలు సిద్ధి

దైనందిన జీవితంలోకి వారసత్వం..

'విజయవాడ ఉత్సవ్ 2.0' కేవలం పండుగ వాతావరణాన్ని మాత్రమే కాకుండా, మన సంస్కృతిని దైనందిన జీవితంలోకి తీసుకురావడానికి చక్కటి వేదికగా నిలుస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ఈ ఉత్సవం ద్వారా స్థానిక కళాకారులు, ఎంటర్‌ప్రెన్యూర్లకు సరికొత్త మార్గాలు సుగమమవుతాయని, అదేవిధంగా పర్యాటక రంగానికి కూడా ఇది సరికొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని తెలిపారు. ముఖ్యంగా ఈ ఉత్సవ వేదికపై స్కిల్ డెవలప్‌మెంట్ అంశానికి కూడా పెద్దపీట వేస్తుండటం ఎంతో అభినందనీయమని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

భక్తులకు విజ్ఞప్తి! విజయవాడలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు. రేపటి నుంచి అటు నో ఎంట్రీ..
భక్తులకు విజ్ఞప్తి! విజయవాడలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు. రేపటి నుంచి అటు నో ఎంట్రీ..

వికసిత్ భారత్ దార్శనికతలో నగరాల పాత్ర

వికసిత్ భారత్ అనే మహోన్నత లక్ష్యంతో దేశం ముందుకు సాగుతున్న తరుణంలో, మన నగరాలు తమ ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపును ఏమాత్రం కోల్పోకుండా అభివృద్ధి చెందడం చాలా ముఖ్యమని ప్రధాని మోదీ నొక్కి చెప్పార తెలిపారు. విజయవాడ ఉత్సవంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ఆయన తన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఉత్సవం విజయవాడ ప్రజలకు, వారి అపురూపమైన సాంస్కృతిక వారసత్వానికి మధ్య ఉన్న బంధాన్ని మరింత దృఢం చేస్తుందని ఆకాంక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+