చిరుత రోదన: వేటగాళ్ల ఉచ్చుకు పసి ప్రాణం బలి..

అనంతపురం జిల్లాలోని మండుతున్న ఎండలు ఒకవైపు.. కనికరం లేని వేటగాళ్ల ఉచ్చులు మరోవైపు.. వెరసి ఒక పసి చిరుత ప్రాణం గాలిలో కలిసిపోయింది. దాహంతో అలమటించి గుక్కెడు నీళ్ల కోసం కొండ దిగి వచ్చిన ఆ నోరులేని జీవులను మృత్యుపాశంలా వేటగాళ్ల ఉచ్చులు చుట్టుముట్టాయి. తన కళ్లముందే ఒక బిడ్డ విగతజీవిగా మారగా, ప్రాణాపాయంలో ఉన్న మరో బిడ్డను నోటకరుచుకుని ఆ తల్లి చిరుత అడవిలోకి అదృశ్యమైన తీరు స్థానికులను కలచివేసింది.

కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామ శివారులోని చాపిరి గుట్ట ప్రాంతం వేటగాళ్లకు అడ్డాగా మారింది. కుందేళ్లను వేటాడేందుకు వారు అమర్చిన 'ఉరులు' అనూహ్యంగా రెండు చిరుత పిల్లలకు ఉరితాళ్లుగా మారాయి. మంగళవారం ఉదయం నీటి కోసం వెతుకుతూ వచ్చిన ఈ రెండు చిరుత పిల్లలు వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నాయి. తప్పించుకోవడానికి అవి చేసిన పోరాటం ఫలించలేదు. ఉచ్చు బిగుసుకుపోవడంతో ఒక చిరుత పిల్ల అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

Poacher s Trap Claims Leopard Cub s Life in Kalyanadurgam Forest Dept Launches Hunt for Absconding Culprits

తల్లి ప్రేమ.. అడవి తల్లి రోదన

తన బిడ్డలు ఆపదలో ఉన్నాయని గుర్తించిన తల్లి చిరుత అక్కడికి చేరుకుంది. ఉచ్చులో చిక్కుకుని విలవిలలాడుతున్న ఒక బిడ్డను చాకచక్యంగా విడిపించి, నోటితో కరుచుకుని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లిపోయింది. అయితే, అప్పటికే చనిపోయిన మరో బిడ్డను చూసి ఆ తల్లి చిరుత పెట్టిన ఆర్తనాదాలు గుట్ట ప్రాంతంలో ప్రతిధ్వనించాయి. వేసవి తీవ్రత వల్ల నీటి వనరులు ఎండిపోవడం, దప్పిక తీర్చుకోవడానికి జనావాసాల వైపు రావడం ఈ మూగజీవుల పాలిట శాపంగా మారింది.

రంగంలోకి అటవీ శాఖ.. పరారీలో వేటగాళ్లు

సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన చిరుత పిల్లకు పంచనామా నిర్వహించి, పోస్ట్‌మార్టం అనంతరం ఖననం చేశారు. వన్యప్రాణుల మృతికి కారణమైన వేటగాళ్లపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వేటగాళ్లు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అడవి జీవుల ప్రాణాలతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రకృతి ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+