రుణమాఫీపై పోచారం, చంద్రబాబు హెచ్చరించారని గంటా
హైదరాబాద్: కాలపరిమితితో సంబంధం లేకుండా రైతు రుణమాఫీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి బుధవారం చెప్పారు. రుణమాఫీకి రూ.12 వేల కోట్లు అవుతాయన్నారు. మరో 10 వేల కోట్ల రూపాయలు అయినా రుణమాఫీ అమలు చేస్తామన్నారు. రైతులెవరూ అధైర్యపడవద్దన్నారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన ప్రతి హామీని అమలుచేస్తామన్నారు.

టిఎస్ పేరుతో రిజిస్ట్రేషన్లు: మహేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో టీఎన్ పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్ కు కేంద్రం అనుమతినిచ్చిందని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి వేరుగా తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ప్రతి జిల్లాకు కోడ్ నెంబర్ ఇస్తామన్నారు. దాని ప్రకారం వాహనాల నెంబర్లు మార్చాల్సి ఉంటుందన్నారు. నాలుగు నెలల్లో పాత వాహనాల నెంబర్లన్నీ మార్చుకోవాలని సూచించారు. అవసరమైతే నాలుగు నెలల గడువును పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కొత్త వాహనాలకు మాత్రం రేపటి నుంచి టీఎన్ పేరుతో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలన్నారు.
రాజధాని లేకుంటే.. ఆర్థిక రాజధాని: గంటా
విశాఖపట్నం రాజధాని కాకపోతే ఆర్థిక రాజధాని అవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపారు. నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. అయ్యన్నపాత్రునితో విభేదలు కోరుకోవడం లేదన్నారు. ఇద్దరు కలిసి జిల్లాను అభివృద్ధి చేయాలన్నది చంద్రబాబు ఆలోచన అన్నారు. ఎవరైనా వ్యక్తిగత దేవేషాలకు దిగితే చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారన్నారు.
సీనియారిటీ వల్లే: చిన రాజప్ప
22 ఏళ్లుగా ఓ కార్యకర్తగా టిడిపికి సేవ చేశానని, తన సీనియారిటీ వల్లే తనకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి పదవి దక్కాయనీ చింతకాయల చినరాజప్ప తెలిపారు. చంద్రబాబు కేబినెట్ బ్రహ్మాండంగా సెట్ అయిందన్నారు. తనపై నమ్మకం ఉంచిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కాపులకు డిప్యూటీ సీఎం ఇస్తానన్న హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నారన్నారు.
ప్రజల ఆకాంక్షల మేరకు పని చేస్తా: మాణిక్యాల రవు
ప్రజల ఆకాంక్షల మేరకు పని చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు అన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన పేరును చంద్రబాబు ప్రతిపాదించిన అనంతరం మాణిక్యాలరావు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని ఆయన చెప్పారు. అర్చకుల బాగోగులను చూస్తానని మాణిక్యాలరావు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications