రేవ్ పార్టీ: రిసార్డ్‌లో యువతుల అశ్లీల డ్యాన్స్, అరెస్ట్

Police arrest 50 persons including ten young girls
హైదరాబాద్: నల్గొండ జిల్లాలో అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతులను, నిర్వాహకులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. జిల్లాలోని బీబీనగర్ సమీపంలో ఓ రిసార్డులో పార్టీ జరిగింది. ఈ పార్టీలో ముంబై, కోల్‌కతా తదితర ప్రాంతాల నుండి తీసుకు వచ్చిన అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించారు. విషయం తెలిసిన పోలీసులు రైడింగ్ చేశారు. ఈ రైడ్‌లో పదిమంది యువతులు, నలభై మంది యువకులు పట్టుబడ్డారు.

వ్యభిచార ముఠా గుట్టురట్టు

ఆన్‌లైన్ ద్వారా హైటెక్ తరహాలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ అతిథి గృహంపై సైబరాబాద్ ఎస్ఓటి అధికారులు దాడి చేసి ఇద్దరు యువతులు సహా తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.

పాతబస్తీకి చెందిన వ్యక్తి ముంబై, కోల్‌కతల నుంచి యువతులను తీసుకు వచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్‌లో విటులను ఆకర్షించే వారని తెలిపారు.

దీనిపై సమాచారం అందడంతో ఆదివారం అతిథి గృహం పైన దాడి చేసినట్లు చెప్పారు. పలువురిని అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుండి ల్యాప్‌టాప్, రూ.3వేల నగదు, ఎనిమిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు పరారీలో ఉండగా, పట్టుబడ్డ యువతులను రెస్క్యూహోమ్‌కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+