వైసీపీకి మరో షాక్.. ఈసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన వ్యవహారంలోనే ఆయనను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్‌తో లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో అనూహ్యమైన మలుపు చోటు చేసుకుంది. ఆయనను మరికాసేపట్లో విజయవాడకు తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ అరెస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి. దీనిపై వైసీపీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై మరింత సమాచారం వెలువడే అవకాశం ఉంది.ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేయడం జరిగింది.

Police arrest Chevireddy Bhaskar Reddy

గత వైసీపీ ప్రభుత్వ హయంలో 3 వేల కోట్లకు పైగానే లిక్కర్ స్కాం జరిగిందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో జగన్ పాత్ర కూడా ఉందని, ఆయన్ను విచారణ చేయాలని కూటమి నేతలు పట్టుబడుతున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అండదండలు కూడా ఉండటంతో లిక్కర్ స్కాంలో విషయంలో కూటమి ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతుంది.

ఇప్పటికే ఈ స్కాంపై సిట్ అధికారులు ప్రత్యేక దర్యాప్తు చేయిస్తోంది కూటమి ప్రభుత్వం. దీనిలో భాగంగానే ఈ కేసులో కీలక అరెస్టులు జరుగుతున్నాయి. లిక్కర్ స్కాంలో పలువురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏపీ లిక్కర్ స్కాంలో ప్రధాని పాత్ర పోషించిన రాజ్ కసిరెడ్డిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే మాజీ ఐఏఎస్‌ ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్‌ ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డిలను కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మొదటి మూడు రోజుల పాటు వీరిద్దర్ని ప్రత్యేకంగా విచారించిన అధికారులు, ఆ తర్వాత అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు.

ధనుంజయరెడ్డి,కృష్ణమోహన్‌రెడ్డిలను టచ్ చేశారంటే , దాదాపు జగన్ దగ్గరకు వెళ్లినట్టే అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జగన్ కూడా ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. లేని లిక్కర్ స్కాంను సృష్టించి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, వీళ్లు మహా అయితే రెండు, మూడు నెలలు జైలులో ఉంచగలుగుతారని చెప్పడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+