రాములు హత్య: అరెస్టైన నయీం ముఠా ఇదే(పిక్చర్స్)
హైదరాబాద్: మాజీ మావోయిస్టు నేత సాంబశివుడు సోదరుడు, తెరాస జిల్లా నేత కొనపురి రాములు హత్య కేసు నిందితులను మంగళవారం కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో పోలీసులు పట్టుకున్నారు.
ఈ నెల 11న నల్లగొండ పట్టణంలో రాములును హత్య చేసిన ముఠా సభ్యులు తిరువనంతపురంలోని ఓ లాడ్జీలో తలదాచుకున్న క్రమంలో అక్కడి పోలీసులు జరిపిన దాడుల్లో పట్టుబడ్డారు.
పట్టుబడిన వారు నయీం ముఠా సభ్యులు. నయీం ముఠా సభ్యుల్లో సోమయ్య, కుమార స్వామి, రమేష్, సురేష్, రవి, ఎల్లేష్‌లు ఉండగా ఈ విషయాన్ని ఆ రాష్ట్ర పోలీసులు ఏపి పోలీసులకు తెలిపారు.

నయీం
నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన నయీం పాతికేళ్ల క్రితం నక్సలైట్‌గా మారాడు. ఐపిఎస్ వ్యాస్ హత్య కేసులో నిందితుడిగా నిలిచాడు.

నయీం
అనంతరం నక్సల్స్ నేతలతో విభేదాల కారణంగా వారికి శతృవుగా మారి పోలీసు పెద్దల సహకారంతో నక్సల్స్‌ను వారికి మద్ధతుగా నిలిచే పౌర హక్కుల సంఘాల నాయకులను అంతమొందించడం పనిగా పెట్టుకున్నాడు.

నయీం
మావోయిస్టు రాష్ట్ర పార్టీ మాజీ కార్యదర్శి సాంబశివుడితో పాటు ఆయన తమ్ముడు కొనపురి రాములు హత్య కేసులో నయీంప్రధాన నిందితుడు.

నయీం
పదుల సంఖ్యలో హత్యలు.. లెక్కలేనన్ని సెటిల్‌మెంట్లతో మొత్తం 40కి పైగా కేసులు నయీం సహా ఆయన ముఠా సభ్యులపై ఉన్నాయి.

నయీం
ఈ నేపథ్యంలో ఈ నెల 11న తెలంగాణ రాష్ట్ర సమితి నేత కోనాపురి రాములును నల్గొండ జిల్లాలో నయీం గ్యాంగ్ ద్విచక్ర వాహనంపై వచ్చి హత్య చేసింది.

నయీం
కోనాపురి రాములు హత్య నయీం ముఠా పనేనని పోలీసులు అనుమానించారు. ఇప్పుడు నయీం ముఠాలోని అరుగురు నిందితులను అరెస్టు చేశారు.

నయీం
పట్టుబడిన వారు నయీం ముఠా సభ్యులు. నయీం ముఠా సభ్యుల్లో సోమయ్య, కుమార స్వామి, రమేష్, సురేష్, రవి, ఎల్లేష్‌లు ఉండగా ఈ విషయాన్ని ఆ రాష్ట్ర పోలీసులు ఏపి పోలీసులకు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications