Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వంశీ ఉక్కిరి బిక్కిరి - తాజా నిర్ణయంతో..!!

వల్లభనేని వంశీకి ఉచ్చు బిగుస్తోంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వంశీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ హయాంలో వంశీ వ్యవహార శైలి పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ కార్యాలయం తో సహా టీడీపీ నేతల పైన వంశీ అనుచురుల దాడుల కేసుల్లో ఇప్పుడు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో నమోదు చేసిన కేసులో వంశీ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు పోలీసుల తాజా నిర్ణయంతో వంశీ పైన చర్యలు ఖాయంగా కనిపిస్తున్నాయి.

గన్నవరం టీడీపీ నేత కాసనేని రంగబాబు పై దాడి కేసులో వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేసారు. వీరిలో వంశీ ప్రధాన అనుచరుడుగా చెప్పుకునే ఓలుపల్లి మోహనరంగాతో సహా మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో వివిధ ప్రాంతాల్లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ హయాంలో వంశీ, ఆయన మద్దతు దారులు వ్యవహార శైలి పైన అనేక ఫిర్యాదులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వంశీ పైన చర్యల దిశగా అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో వంశీ పైన కేసు నమోదైంది.

Police arrest Vallbhaneni Vamsi key followers in TDP leader Attack case in Gannavaram

గతంలో టీడీపీలో పని చేసిన వంశీ 2019 ఎన్నికల ఫలితాల తరువాత వైసీపీకి దగ్గరయ్యారు. ఆ తరువాత టీడీపీలోని పలువురు నేతలతో గొడవలు జరిగాయి. అక్కడ యార్లగడ్డ వెంకటరావుకు మద్దతుగా కాసరనేని రంగబాబు టీడీపీలో చేరటం రుచించని వంశీ ఆయన పైన గురి పెట్టారు. ఆ తరువాత రంగబాబు పైన దాడి జరిగింది. హత్యాయత్నం కింద కేసు నమోదైంది. ఇప్పుడు ఈ కేసులో వంశీ ముఖ్య అనుచరులను పోలీసులు అరెస్ట్ చేసారు. అదే విధంగా టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ గన్నవరంలో అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. వాటి విచారణ ఆధారంగా వంశీ చుట్టు ఉచ్చు బిగుస్తోంది. తమను వేధించిన వంశీతో సహా ఆయన మద్దతు దారుల పైన చర్యలు తీసుకోవాలని స్థానిక టీడీపీ నాయకత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డిమాండ్ చేస్తోంది.

దీంతో, ఒక్కో కేసులో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. దొంతు చిన్నా నివాసంపై దాడి కేసు లోనూ తిరిగి విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో కొందరు పోలీసులు సైతం వంశీకి సహకరించారనే ఫిర్యాదులు ఉన్నాయి. అరెస్ట్ అయిన వంశీ అనుచరులు విచారణ సమయంలో చెప్పే అంశాలు కేసు దర్యాప్తులో కీలకం కానున్నాయి. దీంతో, వంశీకి ఉచ్చు బిగుస్తున్నట్లు స్పష్టం అవుతోంది. త్వరలోనే కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+