రేవ్ పార్టీ: అర్థనగ్న నృత్యాలు చేస్తూ పట్టుబడ్డ యువతీయువకులు
హైదరాబాద్: అర్థనగ్న నృత్యాలు చేస్తున్న కొందరు యువతీయువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ ఇంట్లో ముంజ్రా డ్యాన్స్ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎస్‌ఓటీ పోలీసులు అర్థరాత్రి దాడులు నిర్వహించారు.
ముంబై నుంచి రప్పించిన మోడల్స్‌తో కొందరు యువకులు పార్టీ పేరుతో అశ్లీల నృత్యాలను చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పార్టీ నిర్వాహకుడు దిలీప్‌తోపాటు అశ్లీల నృత్యాలు చేస్తున్న 8 మంది యువతులు, 22 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు.

పట్టుబడిన వారిలో ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్లు సమాచారం. వీరి వద్ద నుంచి రూ.1.21 లక్షలు, సెల్‌ఫోన్లు, మద్యం బాటిళ్లు, 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని మంగళవారం కోర్టులో హాజరుపరుచనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరికి రిమాండ్
డి పోచంపల్లిలోని సాయిపూజా కాలనీలో గృహిణిని బంధించి అత్యాచారానికి పాల్పడి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన నిందితులు హఫీజ్‌ఖాన్, హఫ్సల్‌ఖాన్‌ను సోమవారం దుండిగల్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు












Click it and Unblock the Notifications