ఏపీ పోలీసులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు..?

ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు చెందిన మొత్తం 16 మంది ఐపీఎస్‌ అధికారులకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక సేవా పురస్కారాలను ప్రకటించింది. వీరిలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మహేశ్‌చంద్ర లడ్డా, ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌ కుమార్‌, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్‌ కుమార్‌, పోలీసు పర్సనల్‌ విభాగం ఐజీ హరికృష్ణ, పీఅండ్‌ఎల్‌ ఐజీ రవిప్రకాశ్‌, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబులకు 'అతి ఉత్కృష్ట సేవా పతకాలు' లభించాయి.

ఇక ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ, ఏసీబీ డైరెక్టర్‌ జయలక్ష్మి, విశాఖ రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జెట్టి, ఆక్టోపస్‌ ఐజీ సెంథిల్‌ కుమార్‌, అనంతపురం రేంజ్‌ ఐజీ షేముషి, కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌, విజయనగరం ఎస్పీ దామోదర్‌, తూర్పుగోదావరి ఎస్పీ నరసింహ కిశోర్‌, ఇంటెలిజెన్స్‌ ఎస్పీ గీతాదేవికి 'ఉత్కృష్ట సేవా పతకాలు' ప్రకటించారు. అలానే ఐపీఎస్‌ అధికారులతో పాటు కానిస్టేబుల్‌ స్థాయి వరకు మొత్తం 353 మందికి 'అతి ఉత్కృష్ట సేవా పతకాలు', మరో 607 మందికి 'ఉత్కృష్ట సేవా పతకాలు' లభించాయి. వివిధ విభాగాల్లో సేవలందిస్తున్న సిబ్బందికి ఈ స్థాయి గుర్తింపు రావడం రాష్ట్ర పోలీసు వ్యవస్థ పనితీరుకు నిదర్శనంగా భావిస్తున్నారు.

police-awards-given-to-andhra-pradesh-police-by-central-and-state-government-and-winners-list

ఏపీ సర్కారు సేవ పతకాలు..

తెలుగు సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీ సంఖ్యలో సేవా పతకాలను ప్రకటించింది. మొత్తం 610 మంది పోలీసు మరియు ఇతర యూనిఫామ్‌ సర్వీసుల సిబ్బందికి ఈ అవార్డులు దక్కాయి.

38 మందికి ముఖ్యమంత్రి శౌర్య పతకాలు

7 మందికి మహోన్నత సేవా పతకాలు

72 మందికి ఉత్తమ సేవా పతకాలు

60 మందికి కఠిన సేవా పతకాలు

318 మందికి సాధారణ సేవా పతకాలు

ఈ జాబితాను రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ విడుదల చేశారు.

ఇతర విభాగాలకు కూడా..

పోలీసులతో పాటు అగ్నిమాపక, విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఎస్‌పీఎఫ్‌ వంటి విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికీ గుర్తింపు లభించింది. అగ్నిమాపక శాఖలో 6 మందికి ఉత్తమ సేవా, 50 మందికి సేవా పతకాలు ఇవ్వగా, విజిలెన్స్‌ విభాగంలో 2 మందికి మహోన్నత సేవా, 5 మందికి ఉత్తమ సేవా, 20 మందికి సేవా పతకాలు ప్రకటించారు. ఎస్‌పీఎఫ్‌లో కూడా పలువురికి అవార్డులు లభించాయి.

ఈ అవార్డులు కేవలం గౌరవ సూచకాలు మాత్రమే కాకుండా, ప్రజల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్న పోలీసు సిబ్బందికి ఒక ప్రోత్సాహం. కఠిన పరిస్థితుల్లో సేవలందించిన వారికి ఈ గుర్తింపు మరింత బాధ్యతతో పని చేయడానికి ప్రేరణగా నిలుస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. పోలీసు వ్యవస్థలో ఉన్నత స్థాయి నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ఈ స్థాయిలో అవార్డులు రావడం ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణంగా మారింది. నిష్పక్షపాత విధులు, సమయస్ఫూర్తి, ప్రజా భద్రతపై నిబద్ధతతో పనిచేస్తున్న పోలీసుల సేవలను దేశ స్థాయిలో గుర్తించడం విశేషంగా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+