AP Police: విశాఖ తీరంలో కలకలం:ఆపరేషన్ డాల్ఫిన్స్ నోస్: పాక్ తో లింకులు.. నౌకాదళ సిబ్బంది అరెస్టు..?

విశాఖపట్నం: నౌకాదళానికి చెందిన ఏడుమంది సిబ్బందిని విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారనే సమాచారం కలకలం రేపుతోంది. గూఢచర్యానికి పాల్పడుతున్నారనే కారణంతో వారిని అరెస్టు చేశారని అంటున్నారు. పాకిస్తాన్ తో లింకులు ఉన్నట్లు పక్కా సమాచారం ఉండటంతో ఈ ఏడుమందితో పాటు ఓ హవాలా రాకెట్ ఆపరేటర్ కు కూడా విశాఖపట్నం పోలీసులు సంకెళ్లు వేశారంటూ జాతీయ మీడియా వెల్లడించింది.

విశాఖపట్నం నౌకాదళానికి చెందిన ఏడుమంది సిబ్బంది, ఓ హవాలా రాకెట్ ఆపరేటర్ తో కలిసి గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు విశాఖపట్నం స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు కొద్దిరోజుల కిందట కీలక సమాచారం అందింది. దీన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు స్కెచ్ వేశారు. ఏడుమంది అనుమానితులను గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు సమాచారాన్ని సేకరించడానికి మారు వేషాలతో వారికి చేరువ అయ్యారు.

Andhra Pradesh: Police bust espionage racket with Pakistan links, total 7 Navy personnel held by the Police

ఏడుమంది అనుమానితులపై నిఘా వేశారు. పాకిస్తాన్ తో వారికి లింకులు ఉన్నట్లు నిర్ధారించారు. గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు సాక్ష్యాధారాలను సేకరించారు. దీనికి ఆపరేషన్ డాల్ఫిన్స్ నోస్ అని పేరు పెట్టారు. కీలక సాక్ష్యాధారాలను సేకరించిన తరువాత ఈ ఏడుమందిని అరెస్టు చేశారు. వారితో పాటు ఓ హవాలా రాకెట్ ఆపరేటర్ పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు అధికారికంగా వెల్లడించినట్లు తెలుస్తోంది. వారిని శుక్రవారం స్థానిక న్యాయస్థానంలో ప్రవేశపెడతారని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+