కొడాలి నానిపై కేసు నమోదు..వైసీపీ కార్యాలయంపై టీడీపీ జెండాలు
మాజీ మంత్రి కొడాలి నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమతో కొడాలి నాని బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన మీద కేసు నమోదైంది. తమను వేధించి మరీ బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కొడాలి నానితో ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మరో ఇద్దరు వైసీపీ నేతలపై 447, 506 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఎన్నికల ముందు కొందరు వాలంటీర్లు వైసీపీకి మద్దతుగా రాజీనామా చేశారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో వాలంటీర్లు మాట మార్చేశారు. వైసీపీ నేతలు కొందరు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్లు కోరుతున్నారు. తమ ఉద్యోగాలు తమకు కావాలంటూ టీడీపీ నేతలకు మొర పెట్టుకుంటున్నారు. దీనిపై మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్పందించారు. ఆయన మీడియాతో రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని క్లారిటీ ఆయన ఇచ్చారు.

కానీ ఎన్నికల సమయంలో ఉద్యోగాలకు రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోబోమని మంత్రి తేల్చి చెప్పారు. రాజీనామా చేయకుండా ఉద్యోగంలో ఉన్న వాలంటీర్లతో పని చేయించుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. రాజీనామా చేసిన వాలంటీర్లు వైసీపీ సానుభూతిపరులనే ఆరోపణల నేపథ్యంలో వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకొవద్దని నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తమతో బలవంతంగా రాజీనామా చేయించారని కొడాలి నానిపై కొందరు వాలంటీర్లు ఫిర్యాదు చేయడంతో గుడివాడ పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది.
ఇదిలా ఉంటే గుడివాడ వైసీపీ కార్యాలయ భవనంపై టీడీపీ నేతలు ఫ్లెక్సీలు ప్రత్యక్షం అయ్యాయి. శరత్ థియేటర్లో ఎనిమిది సంవత్సరాల క్రితం వైసీపీ కార్యాలయాన్ని కొడాలి నాని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు టీడీపీ విజయం సాధించడంతో శరత్ థియేటర్‌పై చంద్రన్న అసెంబ్లీలోకి పునరాగమనం కానున్న పేరుతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications