రామ్ గోపాల్ వర్మకు షాక్.. ఆ కారణంగానే రాజమండ్రిలో కేసు నమోదు !
తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. 1990లో వచ్చిన ఆయన తొలి చిత్రం 'శివ' తెలుగు సినిమాకు కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఆ సినిమా ద్వారా యూత్ ఫిల్మ్ మేకింగ్‌లో సాంకేతికత, రియలిజం అనే పదాలను పరిచయం చేశారు. ఆ తర్వాత 'క్షణక్షణం', 'గాయం', 'రాత్రి', 'అంతం' వంటి సినిమాలతో ఆడియన్స్ ని మెప్పించారు. అటు బాలీవుడ్‌లో కూడా అడుగు పెట్టి 1998లో వచ్చిన 'సత్య' చిత్రం ద్వారా గ్యాంగ్‌స్టర్ సినిమాలకు కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. అలానే 'కంపెనీ', 'రోడ్', 'రన్', 'సర్కార్' వంటి చిత్రాలు సంచలనం సృష్టించాయి.
కాగా అటు సినిమాల తోనే కాకుండా వివాదాల తోనూ నిత్యం వార్తల్లో నిలుస్తారు ఆర్జీవీ. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. అంతే కాకుండా టీవీ ఇంటర్వ్యూలతో కూడా తరచూ సంచలనానికి తెర లేపుతారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన చేసిన కామెంట్స్ వివాదానికి కారణం అయ్యాయి. దీంతో వర్మ మరోసారి చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు.

అసలేం జరిగిందంటే..?
ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వర్మ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు హిందూ ఇతిహాసాలు, దేవతలు, భారత సైన్యం, ఆంధ్ర ప్రజలును కించపరిచేలా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. రాజమండ్రికి చెందిన న్యాయవాది, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్, ఈ వివాదాస్పద ఇంటర్వ్యూకు సంబంధించిన ఫిర్యాదును రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో దాఖలు చేశారు. ఆయన తన ఫిర్యాదులో, "వర్మ వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయనే" ఆరోపణ చేశారు.
అంతేకాకుండా ఇంటర్వ్యూ నిర్వహించిన మహిళా యాంకర్ కూడా ఉద్దేశపూర్వకంగా వర్మను రెచ్చగొట్టే ప్రశ్నలు అడిగి వివాదాన్ని సృష్టించారని ఆరోపించారు. మేడా శ్రీనివాస్ ఫిర్యాదులో మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. వర్మ చేసే ఈ వివాదాలు "ఏదో విదేశీ శక్తులు లేదా టెర్రరిస్టు సంస్థల ప్రోత్సాహంతో జరుగుతున్నాయేమో" అని అనుమానం వ్యక్తం చేశారు. ఆయన ఫిర్యాదును స్వీకరించిన రాజమండ్రి త్రీ టౌన్ పోలీసులు, దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పాటు ఆ టీవీ యాంకర్‌పై కూడా క్రైమ్ నెంబర్ 487/2025 కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications