చంద్రబాబు కారుపై పోలీసుల ఆరా: ఎపి సిఎన్ 6666 నెంబర్
విజయవాడ: చంద్రబాబు నాయుడి కారుపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అంటే, అది చంద్రబాబుదా, కాదా అనే విషయాన్ని అలా ఉంచితే, దానిపై చంద్రబాబు నాయుడు అని రాసి ఉంది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఆ కారు పరుగులు తీసింది.
ఆ కారు ఎవరిదనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. కారు విషయంలో ప్రత్యేకత ఏమీ లేదు. కానీ నెంబర్ ప్లేట్ మాత్రం ఆశ్చర్యకరంగా, అనుమానాస్పదంగా ఉంది. ఎపి7 సిఎన్ అనే నెంబర్ కారుపై సిఎన్ అంటే చంద్రబాబు నాయుడు అని రాసి ఉంది.

ఆకర్షణ కోసం అలా రాశారా, మరేదైనా ఉందా అనే విషయంపై పోలీసులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఆర్టీఎ నిబంధనల ప్రకారం అలా రాయడం తప్పు. ఇంతకు ఆ కారు ఎవరది అనేది తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఆ కారు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఎవరిదైనా కావచ్చునా, లేదా చంద్రబాబు అబిమానులదా అనేది తేలాల్సి ఉంది. ఆ కారుకు సంబంధించిన వార్తాకథనం, ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఓ మీడియా సంస్థ కూడా ఆ ఫొటోను, వార్తాకథనాన్ని ప్రచురించింది.












Click it and Unblock the Notifications