పీతల సుజాత ఇంటి వద్ద దొరికిన డబ్బు (పిక్చర్స్)
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ, సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత చిక్కుల్లో పడ్డారు. ఆమె ఇంటి ఆవరణలో రూ.10 లక్షల నగదు ఉన్న సంచీని మంగళవారంనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై పి శ్యాంసుందర్ ఆ విషయాన్ని ధ్రువీకరించారు.
మంత్రి సుజాతకు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ఓ ఇల్లు ఉంది. ఆ ఇంటి ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ సంచీని వదిలి వెళ్లారు. దానికి సమాచారాన్ని ఆ ఇంట్లో పని చేస్తున్న చికిలే సుబ్బారావు అనే వ్యక్తి పోలీసులకు అందించారు.
సంచీలో రూ. 10 లక్షల నగదుతో పాటు తాడేపల్లి గూడేనికి చెందిన కార్ని లక్ష్మి అనే యువతికి చెందిన డిఎస్సీ హాల్ టికెట్, సర్టిఫికెట్లు కూడా ఉన్నాయని, దీనిపై కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు. పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

పీతల సుజాత
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో మంత్రి పీతల సుజాత తండ్రి బాబ్జి నివాసం వద్ద దొరికిన డబ్బుల సంచి వ్యవహారంపై మంత్రి మాట్లాడుతూ.. మహిళ వదిలి వెళ్లిన నగదు బ్యాగుతో తనకు సంబంధం లేదని మంత్రి పీతల సుజాత చెప్పారు. తన తండ్రి ఇంటికి వచ్చిన మహిళకు మతిస్థిమితం లేనట్టుందని ఆమె చెప్పారు.

పీతల సుజాత
అదే సమయంలో శుభలేక ఇచ్చేందుకు వచ్చి మరిచిపోయి ఉంటారని చెబుతున్నారు. తమ ఇంటి ముందుకు పదిలక్షల రూపాయలు ఎలా వచ్చాయో తెలియదని చెప్పారు. ఆ మహిళ వచ్చిన సమయంలో తాను ఇంట్లో లేనని చెప్పారు.

పీతల సుజాత
మరోవైపు, తాను మంత్రి తండ్రిని కలిసేందుకు వచ్చానని రిటైర్డ్ హాస్టల్ వార్డెన్ అయిన విష్ణువతి చెప్పారు. ఈ డబ్బుసంచీ ఆమెదేనని సమాచారం. తన తమ్ముడి కుమార్తె పెళ్లి కోసం డబ్బులను పాలకొల్లు ఎస్‌బీఐలో డ్రా చేసినట్లు చెప్పారు. ఆ డబ్బుల బ్యాగ్‌ను మరిచిపోయినట్లు చెప్పారని సమాచారం.

పీతల సుజాత
విష్ణువతి, లక్ష్మిలను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. పోలీసులు విష్ణువతిని విచారిస్తున్నారు. విష్ణువతి మంత్రి పీతల సుజాత నివాసం వద్ద వదిలినట్లుగా భావిస్తున్న సంచిలో రూ.500, రూ.100 నోట్లు ఉన్నాయని ఎస్పీ తెలిపారు.












Click it and Unblock the Notifications