అసెంబ్లీ వద్ద భారీగా పోలీసుల మొహరింపు: ఎప్పుడూ లేని విధంగా: అమరావతిలో ఏం జరుగుతోంది...!
ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి సారి 144 సెక్షన్ విధించారు. ఏపీ అసెంబ్లీ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేసారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లోకి వస్తున్న ప్రతీ ఒక్కరినీ తనిఖీ చేస్తున్నారు. గుర్తింపు కార్డు లేని వారిని అనుమతించట లేదు. ఈ రోజు శాసనసభలో ప్రవేశాల పైన ఆంక్షలు విధించారు. ఇదే సమయంలో ఈ రోజుతో ఏపీ శాసనసభా బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. సభలో కాగ్ నివేదిక ప్రవేశ పెట్టనున్నారు. అసెంబ్లీ వద్ద ఇంత భారీ స్థాయిలో బలగాల మొహరింపు వెనుక అసలు కారణం ఏంటంటే..
Recommended Video

ఛలో అసెంబ్లీకి ఎమ్మార్పీఎస్ పిలుపు
నేడు ఏపీ అసెంబ్లీ ముట్టడికి ఎమ్మార్పీఎస్ పిలుపునిచ్చింది. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేయనున్నారు. జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్. ఎమ్మార్పీఎస్ నేతలు నిరసన నేపథ్యంలో అసెంబ్లీ, రాజధాని ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. కొద్ది రోజులుగా ఏపీలో మంద కృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణకు మద్దుగా అనేక వ్యాఖ్యలు చేసారు. గతంలో చంద్రబాబు వ్యవహరించిన విధంగానే ఇప్పుడు జగన్ తీరు ఉందంటూ ఆరోపిస్తున్నారు. మంద కృష్ణ మాదిగ ఛలో అసెంబ్లీ పిలుపు కు వ్యతిరేకంగా అనేక మంది ఇతర నేతలు వ్యాఖ్యలు చేసారు. అయితే, పోలీసు అధికారులు మాత్రం ఎవరైనా అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఆటంకాలు సృష్టించాలని ప్రయత్నిస్తే సహించేది లేదని స్పష్టం చేసారు. దీంతో.. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బలగాలను మొహరించారు.

నేడు సభ ముందుకు కాగ్ నివేదిక..
ఏపీ శాసనసభా అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగుస్తున్నాయి. గత నెల 11వ తేదీన ప్రారంభించిన ఈ సమావేశాల్లో 12వ తేదీన బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇప్పటికే ద్రవ్య వినిమయ బిల్లును సైతం సభ ఆమోదించింది. దీంతో.. ఈ రోజు ప్రశ్నోత్తరాలకు ఎక్కువ సమయం కేటాయించనున్నారు. ముఖ్యంగా అన్న క్యాంటీన్‌ల మూసివేత, నిరుద్యోగ భృతి, విజయవాడ నుంచి విమాన సర్వీసుల నిలిపివేత, అమరావతిలో మంత్రులు, అధికారుల క్వార్టర్ల నిర్మాణం పురోగతిపై టీడీపీ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తనున్నారు. మరోవైపు ఫైబర్‌గ్రిడ్‌లో అక్రమాలు, ఖరీఫ్‌లో విత్తనాల కొరత, వైద్య కళాశాలల్లో ఫీజులు, వ్యవసాయ రుణాలమాఫీపై వైసీపీ సభ్యుల ప్రశ్నలు లేవనెత్తనున్నారు. దీంతో పాటుగా 2017-18 కాలానికి సంబంధించిన కాగ్ నివేదికను సభలో ఆర్దిక మంత్రి బుగ్గన ప్రవేశ పెట్టనున్నారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications