అయ్యన్నపాత్రుడు అరెస్ట్ కు రంగం సిద్దం - సీఎంపై అనుచిత వ్యాఖ్యలు : ప్రహరీ కూల్చివేత..!!

టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆయన ఇంటిని పెద్ద సంఖ్యలో పోలీసులు చుట్టుముట్టారు. కొంత కాలంగా అయ్యన్న సీఎం జగన్ తో సహా వైసీపీ నేతల పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా చోడవరం మినీ మహానాడు లోనూ సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసారు. దుర్భాషలాడారు. ఇక, వైసీపీ ముఖ్య నేత విజయ సాయి రెడ్డి సైతం అయ్యన్న తీరు పైన ట్వీట్ల ద్వారా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అక్రమ ఇంటి నిర్మాణ ప్రహరీ కూల్చివేత

అక్రమ ఇంటి నిర్మాణ ప్రహరీ కూల్చివేత

అయ్యన్న మంత్రిగా ఉన్న సమయంలో ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మాణం చేశారని నిర్ధారణ కు వచ్చిన అధికారులు అక్రమంగా నిర్మించిన ప్రహరీని ఈ రోజు కూల్చివేసారు. దీంతో..ఆయన ఇంటి వద్ద భారీ పోలీసు బలగాలు మోహరించారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చుతారంటూ అయ్యన్న అనుచరులు..టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే, అక్రమ నిర్మాణంపై ముందుగానే నోటీసులు ఇచ్చామంటున్న తహాశీల్దార్ చెబుతున్నారు. ఈ ఉదయం అక్రమంగా నిర్మించిన ప్రహరీని కూల్చివేసారు.

భారీగా మొహరించిన పోలీసులు

భారీగా మొహరించిన పోలీసులు

అయ్యన్న ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మొహరించటంతో ఆయన్న అరెస్ట్ చేసేందుకు వచ్చారని అనుచరులు తరలి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యన్న ఇంటికి వచ్చే మార్గాలకు పోలీసులు మూసివేసారు. అనుచరులు - టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకోకుండా ముందుగానే పోలీసు బలగాలను మొహరించారు.

ఇప్పటికే అయ్యన్న పైన 12 కేసులు నమోదయ్యాయి. నిర్భయ కేసు సైతం నమోదు చేసినట్లు చెబుతున్నారు. మంత్రి అంబటి రాంబాబు పైన ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సీఎం తో సహా నేతలపై అనుచిత వ్యాఖ్యలు

సీఎం తో సహా నేతలపై అనుచిత వ్యాఖ్యలు

సీఎంతో సహా వైసీపీ నేతలను ఉద్దేశించి ఆయన దుర్భాషలాడటం ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీంతో..ఆయన అరెస్ట్ తప్పదనే ప్రచారం సాగుతోంది. నర్సీపట్నంలో టెన్షన్ కొనసాగుతోంది. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో పర్యటించిన సమయంలో సీఎంను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకు పలు సందర్భాల్లో ఆయన వైసీపీ నేతల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఫిర్యాదులు నమోదవుతున్నాయి. ఇప్పుడు పోలీసులు పెద్ద సంఖ్యలో రావటం..అక్రమ నిర్మాణ ప్రహరీనీ కూల్చివేయటం.. ఇంటి వద్ద బలగాలు మోహరించటం తో ..ఆయన అరెస్ట్ కు రంగం సిద్దమైందనే ప్రచారం సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+