బుక్ అయిన వైసీపీ మాజీ మంత్రి
Kakani Govardhan Reddy: రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారం.. దుమారం రేపుతోంది. కూటమి ప్రభుత్వం- వైసీపీకి మధ్య మాటల యుద్ధానికి తెర తీసింది. విమర్శలు ప్రతివిమర్శలకు కారణమైంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వ్యతిరేక పోస్టులు పెడుతున్నారనే కారణంతో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తోన్న విషయం తెలిసిందే.

మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెట్టే వారికి చంద్రబాబు హెచ్చరికలను జారీ చేశారు. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటామని, ఆడబిడ్డల జోలికి వస్తే మాత్రం సహించబోమని అన్నారు. వ్యక్తిత్వం హననం చేసే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పారు.
దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్ కే రోజా, పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయిరెడ్డి గళం విప్పారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై ఎదురుదాడికి దిగారు. వ్యక్తిత్వ హననం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడంటూ ధ్వజమెత్తారు. గతంలో చంద్రబాబు మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు.
తాజాగా తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని సోషల్ మీడియాలో ప్రశ్నించాడనే కారణంతో నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకి హాజరు కావాలంటూ వెంకటాచలం పోలీసులు ఆయనకు సమాచారం ఇచ్చారు.
నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతిని కాకాణి గోవర్ధన్ రెడ్డి కొంతకాలంగా ప్రశ్నిస్తోన్నారని, సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారని జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారు. ఆయన అడుగుతున్న ప్రశ్నలకు సోమిరెడ్డి వద్ద సమధానాలు ఉండట్లేదని తేల్చి చెబుతున్నారు.
ఈ కారణంతోనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందంటూ నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు ఆరోపిస్తోన్నారు. ఎలాంటి అణచివేత చర్యలు తీసుకున్నప్పటికీ తలొగ్గేది లేదని స్పష్టం చేస్తోన్నారు.
-
విశాఖలో వాహనదారులకు హెచ్చరిక .. ఆ పని చేస్తే ఇక కష్టమే -
వరంగల్ లో ఆ పోలీస్ స్టేషన్ అంతే.. ఎస్సైపై సస్పెన్షన్ వేటు! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ











Click it and Unblock the Notifications