ఏ క్షణంలోనైనా మాచర్ల వైసీపీనేత పిన్నెల్లి అరెస్ట్.. మఫ్టీలో ఆయన ఇంటివద్ద పోలీసులు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో ఎన్నికల పోలింగ్ నాడు, పోలింగ్ తర్వాత చోటు చేసుకున్న దారుణ ఘటనలు తెలిసిందే. ఎన్నికల పోలింగ్ నాడు పోలింగ్ బూత్ లోపలికి వెళ్లి ఈవీఎంలు బద్దలు కొట్టిన వైసిపి తాజా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎపిసోడ్ ఏపీ వ్యాప్తంగా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే.
పిన్నెల్లి అరెస్ట్ కు రంగం సిద్ధం
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన పనికి ఆయనను అరెస్ట్ చేయాలని పోలీసులు ప్రయత్నించడం, ఆ తర్వాత ఆయన కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక తాజాగా ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో అరెస్ట్ నుండి రక్షణ కోసం హైకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియనున్న క్రమంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది.

మే 13న పిన్నెల్లి వీరంగం
మే 13వ తేదీన పోలింగ్ జరుగుతుండగా అనుచరులతో కలిసి పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళిన పిన్నెల్లి ఈవీఎంను నేలకేసి కొట్టి ధ్వంసం చేసి, వివీ ప్యాట్ కూడా పగలగొట్టారు. ఇక ప్రశ్నించిన టీడీపీ ఏజెంట్ ను ఎన్నికల పోలింగ్ నాడు సాయంత్రం తన అనుచరులతో తల పగలగొట్టించాడు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రశ్నించిన మహిళను దుర్భాషలాడాడు.
నేటితో ముగుస్తున్న పిన్నెల్లి బెయిల్ గడువు.. అరెస్ట్ కు రంగం
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో ఈవీఎం ధ్వంసం మాత్రమే కాకుండా మూడు హత్యాయత్నం కేసులు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై నమోదయ్యాయి. ఆ తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడితో కలిసి పరారయ్యాడు. ఆపై హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన పిన్నెల్లి సోదరుల బెయిల్ గడువు నేటితో ముగుస్తున్న క్రమంలో పోలీసులు అరెస్టుకు రంగం సిద్ధం చేశారు.
పిన్నెల్లి ఇంటి వద్ద మఫ్టీలో పోలీసులు
పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గార్గ్ ఆదేశాలతో ఆయన ఇంటి చుట్టు పోలీసులు మఫ్టీలో కాపలా కాస్తున్నారు. గతంలోలా పోలీసుల కళ్ళుగప్పి రాష్ట్రం విడిచిపెట్టి పారిపోకుండా తగిన చర్యలు చేపట్టారు. ఏ క్షణానైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.ఇక ఏపీలో ప్రభుత్వం కూడా మారటంతో, టీడీపీ కూటమి అధికారంలోకి రావటంతో పిన్నెల్లి ఎపిసోడ్ ను వదిలే ప్రసక్తే లేదంటున్నారు టీడీపీ నేతలు.












Click it and Unblock the Notifications