కృష్ణా కాల్పులు: దర్యాఫ్తు ముమ్మరం, బిర్యానీ తిని..!

 Police investigating Krishna district murder case
విజయవాడ: కృష్ణా జిల్లా పెద అవుటుపల్లిలో జరిగిన ముగ్గురు హత్యల కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో పొట్టిపాడు టోల్‌గేటు దగ్గర పొదల్లో పడివున్న ఎరుపు రంగు ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులు రెండు రోజుల క్రితం ఈ బైక్‌ను సెకండ్‌ హ్యాండ్‌లో కొనుగోలు చేసినట్లు వారు నిర్ధారించారు.

హత్య కోసం నిందితులు ఉపయోగించిన కారు ఎవరిదో గుర్తించారు. ఆ కారు ఓవర్ బంధువులు, స్నేహితులే హత్యకు కుట్ర పన్ని ఉంటారని అనుమానిస్తున్నారు. హత్యలో మొత్తం నలుగురు పాల్గొనగా ఇందులో ఇద్దరు స్థానికులుగా గుర్తించారు.

హనుమాన్ జంక్షన్‌ లాడ్జిలోని సీసీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఆనవాళ్ల ప్రకారం నలుగురు వేరే ప్రాంతవాసులుగా తెలుస్తోంది. నిందితుల కోసం హైదరాబాద్‌, ఖమ్మం, తూర్పు గోదావరి జిల్లాలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హత్య కోసం డీల్‌ జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇందులో నిజం లేదని భావిస్తున్నారు.

కాగా, హత్య చేసిన నిందితులు.. తాము బస చేసిన హోటల్లో బిర్యానీ తిని అక్కడి నుండి పారిపోయారనట్లుగా వార్తలు వస్తున్నాయి. బుధవారం కృష్ణా జిల్లాలో ముగ్గురి హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. దీని పైన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+