వల్లభనేని వంశీ ఉక్కిరి బిక్కిరి - పోలీసుల తాజా నిర్ణయంతో..!!
వల్లభనేని వంశీ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వల్లభనేని వంశీ అందుబాటులో లేరు తాజా ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసిన వంశీ ఓడిపోయారు. ఆ తరువాత నియోజకవర్గంలో కనిపించటం లేదు. టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో వంశీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వంశీ విదేశాలకు వెళ్లారనే వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
వంశీ కోసం ప్రత్యేక టీంలు
వల్లభనేని వంశీ కోసం ప్రత్యేకంగా పోలీసు టీంలు వెతుకుతున్నాయి. ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరం టీడీపీ కార్యాలయంపై నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు, వైసీపీ నాయకులు దాడిచేసి నిప్పుబెట్టారు. కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు పలువురు టీడీపీ నేతలను గాయపరిచి వాహనాలను తగులబెట్టారు. అయితే వంశీ ప్రోద్బలంతో ఈ ఘటనలో గాయపడిన టీడీపీ నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేశారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని అర్ధరాత్రి వరకూ జీపులో వివిధ పోలీసు స్టేషన్లకు తిప్పారు.

లుకౌట్ నోటీసులు
కాగా.. దాడికి సంబంధించి టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 143, 147, 148, 435, 506 రెడ్‌విత్ 149, 3(1) (ఎస్సీ, ఎస్టీ చట్టం) సెక్షన్ల కింద కేసు (క్రైమ్ నంబర్ 137/2023) నమోదు చేశారు. దాడికి పాల్పడిన వైసీపీ నాయకుల్లో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేారు. వంశీ కోసం ప్రత్యేకంగా మూడు స్పెషల్ టీంలను ఏర్పాటు చేసారు. వంశీ విదేశాలకు వెళ్లారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే వంశీకి పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
పోలీసుల నిఘా
వంశీ విదేశాలకు వెళ్లకుండా కొద్దిరోజుల క్రితమే లుక్ అవుట్ నోటీసులు జారీ చేయగా.. దానికంటే ముందే ఆయన విదేశాలకు చెక్కేసినట్లు సమాచారం. అయితే వంశీ ఇక్కడే ఉన్నారా..లేక విదేశాలకు వెళ్లిపోయాడా ? అన్నదానిపై పోలీసులు ఇంతవరకూ క్లారిటీ ఇవ్వలేదు. వంశీ గురించి తెలుసుకునేందుకు పోలీసులు ఇమ్మిగ్రేషన్ అధికారులను సంప్రదించినట్లు చెబుతున్నారు. వంశీ అమెరికాకు వెళ్లి ఉంటే.. పోలీసులను అక్కడికే పంపి.. అరెస్ట్ చేయించి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో తాజా పరిణామాల పైన పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications