పవన్ కళ్యాణ్ కు విశాఖ పోలీసుల నోటీసులు - వాట్ నెక్స్ట్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సహా ఆ పార్టీ నేతలకు విశాఖ పోటీసులు నోటీసులు జారీ చేసారు. విశాఖ విమానాశ్రయంలో ఏపీ మంత్రుల కార్లపైన దాడితో మొదలైన ఉద్రిక్తత రెండో రోజు కొనసాగుతోంది. మంత్రుల కార్లపై దాడి కేసులో పోలీసులు కొంత మంది జనసేన నేతలను అరెస్ట్ చేసారు. వారిని విడుదల చేసే వారకూ జనవాణి వాయిదా వేస్తున్నట్లు పవన్ ప్రకటించారు. పవన్ విమానాశ్రయంకు చేరుకోగానే ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులు స్వాగతం పలికారు. ర్యాలీ సమయంలో పోలీసులు తనతో రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని పవన్ ఆరోపణలు చేసారు.

ఇక నగరంలో పవన్ జనవాణి నిర్వహించే ప్రాంగణానికి సమీపంలో ఉత్తరాంధ్ర జేఏసీ నేతలు నిరసనకు దిగారు. పవన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేసారు. పవన్ కు మద్దతుగా జనసేన కార్యకర్తల నినాదాలతో టెన్షన్ ఏర్పడింది. ఇదే సమయంలో నగర పోలీసులు పవన్ కళ్యాణ్ తో చర్చలు చేసారు. సాయంత్రం నాలుగు గంటల లోగా విశాఖ వదిలి వెళ్లిపోవాలని సూచించారు. శాంతి భద్రతల సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇదే లిఖిత పూర్వకంగా తెలియచేస్తూ నోటీసులు ఇచ్చారు. నగరంలో సెక్షన్ 30 అమల్లో ఉందని, ఎటువంటి ప్రదర్శనలకు అనుమతి లేదని స్పష్టం చేసారు.

Police Issues notices to Pawan Kalyan and party leaders, asked to leave Vizag City by Evening

పవన్ తో పాటుగా జనసేన ముఖ్య నేతలకూ నోటీసులు అందించారు. దీని పైన పవన్ మండిపడ్డారు. నేరు చరిత్రుల చేతిలో అధికారం ఉంటే ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు. అడిగేవాళ్లు లేరని ఇష్టానుసారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రాంతాలు - కులాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ కోసం పెట్టిన పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ గా మార్చుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఒక కులం..ఒక ప్రాంతంతో రాజకీయం చేయలేమని పవన్ స్పష్టం చేసారు. అమరావతి ఒక కులానికి చెందిన రాజధాని అని చెబుతున్న వారు..విశాఖలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బలంగా పని చేస్తోందని.. బలహీనులపైన బలప్రయోగం చేస్తున్నారని కామెంట్ చేసారు.

అసలు వైసీపీ నేతలకు జనసేన అంటే ఎందుకు ఇంత భయం అని పవన్ అడిగారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తనకు పవన్ సోదరుడు లాంటి వాడని..ఒకే వర్గమని చెప్పటం పైన పవన్ సీరియస్ అయ్యారు. ఒకే కులమైతే ఏమైనా బొడ్డు కోసం పేరు పెట్టాడా.. నాతో సంబంధాలు కలుపుకొనే చనువు ఎవరిచ్చారని ప్రశ్నించారు. జనవాణి రద్దు చేసుకున్న పవన్ కళ్యాణ్..ఇప్పుడు పోలీసుల నోటీసులతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ పెంచుతోంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+