ఏఎస్ఐ 'రికార్డింగ్ డ్యాన్స్'.. స్టేజీ మీదే ముద్దు పెట్టేసుకున్నాడు..
స్టేజీ మీద రికార్డింగ్ డ్యాన్సర్ల స్టెప్పులకు.. ఆత్రం ఆపుకోలేక స్టేజీ ఎక్కేశాడు ఓ ఏఎస్ఐ. ఆపై తనను తాను మరిచిపోయి చిందులేశాడు. జనం చూస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా..
రాజంపేట: అసాంఘీక కార్యకలాపాలకు దూరంగా ఉండాలంటూ నేరస్తులకు హితబోధ చేసే పోలీసులే.. ఒళ్లు మరిచి రికార్డింగ్ డ్యాన్సులు చేస్తే పరిస్థితేంటి? తాజాగా కడప జిల్లా రాజంపేటలో ఓ పోలీసు అధికారి ఇదే నిర్వాకాన్ని వెలగబెట్టాడు.
స్టేజీ మీద రికార్డింగ్ డ్యాన్సర్ల స్టెప్పులకు.. ఆత్రం ఆపుకోలేక స్టేజీ ఎక్కేశాడు ఓ ఏఎస్ఐ. ఆపై తనను తాను మరిచిపోయి చిందులేశాడు. జనం చూస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా.. ఓ రికార్డింగ్ డ్యాన్సర్ ను స్టేజీ పైనే ముద్దుపెట్టుకున్నాడు.

రాజంపేట సమీపంలోని కుంపిణీపురంలో శుక్రవారం నాడు జరిగిన జాతరలో ఈ ఏఎస్ఐ ఇలా ప్రవర్తించాడు. సదరు ఏఎస్ఐ రాజంపేట సబ్ డివిజన్ పరిధిలోనే పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. రికార్డింగ్ డ్యాన్సులకు పోలీసుల అనుమతి లేకపోయినా.. స్వయంగా పోలీసు అధికారే అందులో పాల్గొనడం.. ఆపై చిందులేయడం.. వారిని ముద్దుపెట్టుకోవడం.. తీవ్ర వివాదస్పదమవుతోంది.
కాగా, నెల్లూరుకు చెందిన ఓ రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ ను రూ.లక్షకు ఒప్పందం కుదుర్చుకుని కుంపిణీపురానికి తీసుకొచ్చినట్టు సమాచారం.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం బంపరాఫర్ - తాజా గడువు, మార్గదర్శకాలు..!! -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్










Click it and Unblock the Notifications