మీ జాతకం మొత్తం తెలుసు..అదుపులో ఉండండి: వర్ల రామయ్యకు పోలీసు అధికారుల సంఘం వార్నింగ్...!

తెలుగుదేశం నేత వర్ల రామయ్య కు పోలీసు అధికారుల సంఘం హెచ్చరించింది. వర్ల రామయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని, ఆయన జాతకం మొత్తం తెలుసునని పోలీసు అధికారుల సంఘం హెచ్చరించింది. పోలీసులను దూషిస్తే న్యాయపోరాటం చేస్తామంది. పోలీసులను కించపరిచేలా మాట్లాడటం ఫ్యాషన్‌ అయిపోయిందని మండిపడిందని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌ సీరియస్ అయ్యారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని, పోలీసు వ్యవస్థ ఎవరికీ తలొగ్గదని, పోలీసులకు అనవసరంగా పార్టీ రంగు పులమొద్దని పోలీసు అధికారుల సంఘం హెచ్చరించింది.

పోలీసులపై ఎవరైనా అసత్య ప్రచారం చేసినా, దూషించినా.. న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పోలీసుల జాతకాలు నీ వద్ద ఉన్నాయని మాట్లాడుతున్నావ్‌.. నీ జాతకం మొత్తం నా దగ్గర ఉంది ఖబర్దార్‌ అంటూ తీవ్రంగా స్పందించారు. అదే విధంగా పోలీసు అధికారుల సంఘం కార్యదర్శి మస్తాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. రాజకీయ పబ్బం గడుపుకోడానికి టీడీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పోలీస్‌ వ్యవస్థ ఎవరికీ తలొగ్గి పనిచేయదని పేర్కొన్నారురు. పోలీసులను కించపరిచేలా మాట్లాడటం ఫ్యాషన్‌ అయిపోయిందని, తమకు అనవసరంగా పార్టీ రంగు పులమడం సరికాదని హితవు పలికారు.

Varla RamaiahPolice officers association warned TDP leader Varla Ramaiah to control his comments on Police departmenent

పోలీసులే లక్ష్యంగా టీడీపీ నేతలు..
కొద్ది రోజులు టీడీపీ నేతలు అధికార పార్టీకి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం డీజీపీ మీద ఆరోపణలు చేస్తున్నారు. తాను కొందరు పోలీసు అధికారుల గురించి మాత్రమే మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు. కొందరు అధికారులు మాత్రం అధికార పార్టీ నేతలు ఏం చెబితే అది చేస్తున్నారని విమర్శిస్తూ..అటువంటి వారు వైసీపీ లో చేరాలని సూచించారు. అదే విధంగా విశాఖలో కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సైతం పోలీసుల మీద సీరియస్ అయ్యారు.

ఇక, పోలీసు అధికారిగా పని చేసి రిటైర్ అయిన టీడీపీ నేత వర్ల రామయ్య పోలీసు అధికారుల జాతకాలు తన వద్ద ఉన్నాయంటూ చేసిన వ్యాఖ్యల మీద పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. నోరు అదుపు పెట్టుకోవాలని హెచ్చరించింది. ఇప్పుడు దీని మీద వర్ల రామయ్య ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+