జనావాసాల్లోనే వ్యభిచారం : పోలీసుల రైడ్, ముఠా గుట్టురట్టు
తాడేపల్లిగూడెం (అర్బన్) : పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో జనావాసాల మధ్యనే వ్యభిచార దందా నడిపిస్తోన్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. గురువారం రాత్రి మెరుపుదాడులు నిర్వహించి నలుగురు నిర్వాహకులతో పాటు ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. దాడిలో భాగంగా.. విటుల నుంచి ఓ కారు, బైక్, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నారు.
మరునాడు సర్కిల్ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి స్థానిక సీఐ మూర్తి పలు వివరాలు వెల్లడించారు. హౌజింగ్ బోర్డులో వ్యభిచార కార్యకలాపాలు సాగుతున్నాయన్న సమాచారం మేరకు పట్టణ ఎస్ఐలు, సీఐలతో కలిసి మెరుపుదాడి చేసినట్టుగా తెలిపారు. దాడుల్లో వ్యభిచార ముఠాకు చెందిన తురాయి రవి, తురాయి లక్ష్మి, కొత్త శ్రీనివాస, బాల మాణిక్యాలరావు, పీ&టీ కాలనీకి చెందిన పుట్టాదేవితో పాటు విటులు మోర్ల వెంకట పెద్దిరాజు, సికిలే సతీశ్ కుమార్ లను అరెస్టు చేశారు.

కేటరింగ్ పేరిట... విటులను కారు ద్వారా వ్యభిచార గృహానికి తరలిస్తున్నారని సీఐ పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవారినే టార్గెట్ గా చేసుకుని వ్యభిచార గృహాలను నడిపిస్తున్నట్టుగా తెలియజేశారు. అమాయకులైన ఎందరో ఆడపిల్లలు ముఠా అఘాయిత్యాలకు బలైపోతున్నారని సీఐ ఆవేదన చెందారు.
బాధిత మహిళల్లో అరకుకు చెందిన ఓ యువతితో పాటు, జిల్లాకే చెందిన మరో ఇద్దరు మహిళలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. యువతను పెడదోవ పట్టించే ఇలాంటి అసాంఘీక కార్యకలాపాలను ఏమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు సీఐ.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications