ఫిలింనగర్లో సెక్స్‌రాకెట్ రట్టు, మరోచోట పట్టుబడ్డ జూఆర్టిస్ట్

Police raided a guest house in the Banjara Hills on Saturday
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఫిలిం నగర్‌లో పోలీసులు వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు. ఇద్దరు మోడల్స్ సహా ముగ్గురు యువతులను రక్షించారు. ఇద్దరు నిర్వాహకులను, ఐదుగురు విటులను పోలీసులు అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం వీరిని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.

ఫిలింనగర్ ప్రాంతంలో ఓ గెస్టు హౌస్‌లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్‌కు సమాచారం అందింది. దీంతో మఫ్టీలో పోలీసు సిబ్బందిని అక్కడ ఉంచారు. శనివారం టాస్క్ ఫోర్స్ ఆ గెస్ట్ హౌస్ పైన దాడి చేసింది.

ఇందులో నగరానికి చెందిన ఇద్దరు ప్రముఖ మోడల్స్‌తో పాటు మరో యువతి దొరికారు. వీరి నుండి సెల్ ఫోన్లు, కొంత మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువతులు 20 నుండి 25 ఐదేళ్ల వయసు ఉన్న వారే. వారిలో ఇద్దరు నగరానికి చెందిన వారిగా, మరొకరిని మధ్యప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించినట్లు తెలుస్తోంది. వారిని రెస్క్యూ హోంకు తరలించారు.

మరోచోట..

మరోవైపు ఎల్బీ నగర్లోను వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. జూనియర్ ఆర్టిస్ట్, నిర్వాహకులు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి పోలీసులు ఓ ఇంటిపై దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. యువతి ఖమ్మం జిల్లాకు చెందిన జూనియర్ ఆర్టిస్టుగా తెలుస్తోంది. యువతిని రెస్క్యూ హోంకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+