సెక్స్ రాకెట్లో కోల్‌కతా మోడళ్లు, రేవ్ పార్టీలో గర్ల్స్ సహా..
హైదరాబాద్: వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఓ హోటల్ గదిలో దాడులు నిర్వహించి ఓ మహిళను శనివారం అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్ గదిలో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు.
నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. సెక్స్ వర్కర్లను రక్షించారు. సెక్స్ వర్కర్లలో కోల్‌కతాకు చెందిన ముగ్గురు మోడల్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. వారిని రెస్క్యూ హోంకు తరలించారు. ఇదే హోటల్లో ముగ్గురు యువకులు, యువతులతో కలిసి మద్యం సేవించి అల్లరి చేస్తుండటంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.

రేవ్ పార్టీ పైన దాడి
హైదరాబాదు నగర శివారులోని శామీర్ పేట సమీపంలోని ఓ రిసార్టులో రేవ్ పార్టీ పైన పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారు. 14 మంది యువకులు, 12 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 26 సెల్‍ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications