వీడిన ఫైరింగ్ మిస్టరీ: ప్రియురాలి భర్తని హత్య చేసేందుకే

అమెకు మరో వ్యక్తితో పెళ్లయింది. దీంతో రవిశాస్త్రి తాను ప్రేమించిన యువతి భర్తను హత్య చేసేందుకు తుపాకీ కొన్నట్లుగా తెలుస్తోంది. అతను మహారాష్ట్రలో లేదా ఖమ్మంలో తుపాకీని కొన్నట్లుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. విజయవాడ బస్టాండులో బుల్లెట్స్ లోడ్ చేస్తుండగా అనుకోకుండా పేలింది.
దీంతో ప్రియురాలి భర్తను హత్య చేయాలన్న రవి ప్లాన్ తిరగబడింది. రవికి సతీష్ అనే వ్యక్తితో పాటు మరో వ్యక్తి సహాయం చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులు మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నారు.
కాగా, విజయవాడ బస్టాండ్‌లో మంగళవారం తెల్లవారుజామున ఎరైవల్ బ్లాక్‌లోని టాయిలెట్స్ వద్ద ఓ యువకుడి చేతిలోని తుపాకీ పేలింది. ఈ ఘటనలో వీర వెంకటరమణ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. ఇబ్రహీంపట్నం ఫెర్రీకి చెందిన రవి మరుగుదొడ్డిలోకి వెళ్లిన కొద్దిసేపటికి అతని చేతిలో ఉన్న తుపాకీ పేలింది. గాయపడిన వెంకటరమణను టాయిలెట్స్ వద్ద పని చేస్తున్న సిబ్బంది వెంటనే పోలీసుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. కృష్ణలంక పోలీసులు రవి పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications