కార్పోరేట్ కాలేజీలో డ్రగ్స్ కలకలం: మంగళగిరి కేంద్రంగా: పోలీసులు అలర్ట్..!

ఏపీ రాజధాని నడి బొడ్డున డ్రగ్స్ కలకలం రేపుతోంది. పోలీసుల సోదాల్లో మంగళగిరి కేంద్రంగా గంజాయి, మత్తుపదార్థాల రవాణా జరుగుతున్నట్టు గుర్తించారు. ఒక కార్పోరేట్ కాలేజీలో గంజాయి వ్యవహారం వెలుగు చూసింది. దీంతో నలుగురు విద్యార్థులు రక్త నమూనాలను సేకరించారు. విద్యార్థులకు టార్గెట్ చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యమంత్రి మొదలు ప్రతిపక్ష నేత మంత్రులు..ప్రభుత్వ పెద్దలు అందరూ కొద్ది వేటు దూరంలో ఉండే ఈ ప్రాంతంలో మత్తు పదార్ధాలు దొరకటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

రక్త నమూనాలు సేకరించిన విద్యార్దులను ఆరా తీస్తున్నారు. వారి రక్త పరీక్ష నివేదికలు వచ్చిన తరువాత పూర్తి సమాచారం తెలుస్తుంది పోలీసులు చెబుతున్నారు. అయితే కార్పోరేట్ కాలేజి విద్యార్దులను లక్ష్యంగా చేసుకొని ఈ దందా కొనసాగిస్తున్నారా..లేక స్థానికుల ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ సాగుతోంది. అయితే..ఈ వ్యవహారం బయటకు రావటంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణ ప్రారంభం అయింది.

Police suspecting drugs using by some students in a corporate college in Mangalagiri started investigation

మంగళగిరి. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి..ప్రతిపక్ష నేతతో సహా.. రాష్ట్ర పోలీస్ బాస్ విధులు నిర్వహించే అధికార కార్యాలయం ఉన్నదీ అక్కడే. అదే ప్రాంతంలో ఇప్పుడు కలకలం రేపుతున్న వార్త పైన పోలీసులు ఫోకస్ చేసారు.మంగళగిరి కేంద్రంగా గంజాయి, మత్తుపదార్థాల రవాణా జరుగుతున్నట్టు గుర్తించారు పోలీసులు. విద్యార్థులకు టార్గెట్ చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఓ కార్పొరేట్ కాలేజీలో గంజాయి వ్యవహారం వెలుగు చూసింది. దీంతో నలుగురు విద్యార్థులు రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. వాటి రిపోర్టుల ఆధారంగా కేసులు నమోదు చేసేందుకు సిద్దం అవుతున్నారు. పోలీసులు దీనిని సీరియస్ గా తీసుకున్నారు.

స్థానికంగా ఉన్న కార్పోరేట్ కాలేజీలోని విద్యార్ధులు నలుగురి దగ్గర వీటిని గుర్తించారు. అయితే..ఇవి వారికి ఎక్కడి నుండి వచ్చాయి.. ఎవరి ద్వారా ఇక్కడకు తీసుకొచ్చారు.. నిజంగా అవి మత్తు పదార్ధాలేనా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. సమాచారం బయటకు రాగానే పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా అధికారులను ఆదేశించారు. గతంలో హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలంతో ఫేమస్ పర్సనాల్టీలు పేర్లు వెలుగులోకి వచ్చాయి. విచారణలు ఎదుర్కొన్నారు. అయితే ఎప్పుడూ లేని విధంగా ప్రశాంతంగా ఉండే మంగళగిరి ప్రాంతంలో ఈ వ్యవహారంలో నిజాలను నిగ్గు తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+