మాజీ మంత్రి ఆనందబాబు ఇంటికి పోలీసులు : అర్ద్రరాత్రి హైడ్రామా : గంజాయి రవాణాపై వ్యాఖ్యలతో..!!
టీడీపీ నేత..మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇంటి వద్ద అర్ద్రరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. ఆయన ఇంటికి రాత్రి పొద్దుపోయిన తరువాత విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీసులు చేరుకున్నారు. సోమవారం ఆనంద్ బాబు గంజాయి దందా పైన మీడియా సమావేశంలో పలు ఆరోపణలు చేసారు. విశాఖ మన్యం నుంచి గంజాయి, మత్తు పదార్థాల రవాణాపై విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి పైన పలు ఆరోపణలకు దిగారు. దీంతో...నర్సీపట్నం పోలీసులు ఆనందబాబు నివాసానికి వచ్చారు.

ఆనందబాబు ఆరోపణల పైన పోలీసుల ఆరా
ఆయన చేసిన ఆరోపణల్లో భాగంగా... గంజాయి రవణాకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని సూచిస్తూ నోటీసులు జారీ చేసారు. ఏ ఆధారాలతో ఆయన వ్యాఖ్యలు చేసారో చెబితే స్టేట్ మెంట్ గా రికార్డు చేసుకుంటామంటూ సూచించారు. అయితే, పోలీసుల నోటీసు తీసుకొనేందుకు ఆనందబాబు నిరాకరించారు. ఆ సమయంలో ఆనందబాబు - పోలీసుల మధ్య కొద్ది సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో..పోలీసులు మంగళవారం మరోసారి వస్తామని చెప్పి వెళ్లిపోయారు. గంజాయి రవాణాపై ఆధారాలు లేదా వివరణ ఇవ్వాలని ఆనంద్‌బాబును అడిగినట్లు నర్సీపట్నం సీఐ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నం - నిరాకరణ
ఆయన వ్యాఖ్యలతో ఆధారాలు లభిస్తాయని నర్సీపట్నం నుంచి గుంటూరు వచ్చామని తెలిపారు. ఆనంద్‌బాబు అర్ధరాత్రి స్టేట్‌మెంట్ ఇవ్వను అన్నారు. అందుకే మంగళవారం ఉదయం వస్తామని చెప్పాం. స్టేట్‌మెంట్ ఇవ్వకుంటే 91 సీఆర్ఫీఎఫ్ కింద నోటీసులు ఇస్తాం. అప్పుడు చింతపల్లి వచ్చి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని సీఐ అన్నారు. దీంతో.. లీసుల తీరుపై ఆనంద్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి స్థావరాలపై తెలంగాణ పోలీసులు దాడి చేయడం దారుణమన్నారు.
Recommended Video

మరోసారి నోటీసుల జారీకి ప్రయత్నం
దాడి సమయంలో రాష్ట్ర పోలీసులు ఏం చేస్తున్నారని.. గిరిజనులపై దాడి జరిగితే మాట్లాడే హక్కు మాకు లేదా అన్నారు. మాజీ మంత్రిగా మీడియాతో మాట్లాడే స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. ప్రస్తుత డీజీపీ కొత్త సంస్కృతి తెస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. తెదేపా ప్రభుత్వంలో పోలీసులు ఇలానే పని చేశారా అంటూ ప్రశ్నించారు. గతంలో ఇదే రకమైన వ్యాఖ్యలతో టీడీపీ ముఖ్య నేతలకు సైతం పోలీసు ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేసారు.
ఈ రకమైన వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బ తింటుందని సూచించారు. దీంతో..ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారి పైన కఠినంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ పైన ఆరోపణలు చేసిన టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు సైతం కాకినాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications