వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నివురు గప్పిన నిప్పులా కోనసీమ

|
Google Oneindia TeluguNews

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు ముఖద్వారంగా ఉన్న కోనసీమలో ఇప్పుడు రావణ కాష్టం రగులుతూనే ఉంది. ప్రశాంతతకు, పచ్చదానికి మారుపేరైన కోనసీమలో ఇటీవల అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. జిల్లాకు పేరు మార్పు అంశానికి రాజకీయ రంగు పులుముకోవడంతో ఉద్రిక్త పరిస్థితులకు ఆలవాలమవడమే కాకుండా ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో అక్కడి ప్రజలున్నారు.

కలిసి పనిచేసినవారే విడిపోయారు

కలిసి పనిచేసినవారే విడిపోయారు


కలిసి పనిచేసినవారే రెండు గ్రూపులుగా విడిపోవడంతో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోని కోనసీమ జనం ఇప్పుడు రాజకీయాల గురించే మాట్లాడుకుంటున్నారు. కోనసీమ జిల్లాను ప్రభుత్వం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రభుత్వం ప్రకటించింది. అంతే ఒక్కసారిగా కోనసీమ భగ్గుమంది. ప్రశాంతంగా ఉండే రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆ పేరు మార్చాలని, కోనసీమ జిల్లాగానే ఉంచాలంటూ ఒక వర్గం ఆందోళనకు పిలుపునిచ్చింది. అది ఎంత హింసకు దారితీసిందో మనందరికీ తెలిసిందే.

రాజకీయంగా వారిని దెబ్బకొట్టాలని..

రాజకీయంగా వారిని దెబ్బకొట్టాలని..


కోనసీమలో మొదటి నుంచి రెండు సామాజికవర్గాల మధ్య నివురు గప్పిన నిప్పులా పరిస్థితి ఉండేది. జిల్లా పేరు మార్చినప్పుడు ఒక వర్గం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. అంతేకాకుండా తాము చేసిన పోరాటంవల్లే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు జిల్లాకు పెట్టారంటూ సంబరాలు చేసుకున్నారు. దీన్ని మరో వర్గం వ్యతిరేకించింది. ఇతర సామాజికవర్గాలను కూడా కలుపుకొని కోనసీమ జిల్లా కోసం పోరాటం ప్రారంభించారు. కోనసీమ జిల్లా పేరు మార్చడంలో ఎవరైతే కీలకపాత్ర పోషించారో వారిని రాబోయే ఎన్నికల్లో రాజకీయంగా దెబ్బ కొట్టాలని, ఆ సామాజికవర్గం నుంచి ఎవరు పోటీచేసిన ఓడించాలని కంకణం కట్టుకున్నారు.

రావణ కాష్టంలా కోనసీమ

రావణ కాష్టంలా కోనసీమ


అయితే ఆ సామాజికవర్గానికి ధీటుగా అంబేద్కర్ పేరుకోసం పోరాడిన సామాజికవర్గం వ్యవహరిస్తోంది. ప్రత్యర్థి వ్యూహాలు ఎలా ఉంటాయి? అనే విషయాన్ని అవగతం చేసుకొని అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. దీనిపై చర్చించేందుకు ఈరోజు సమావేశమయ్యారు. ప్రశాంతంగా ఉండే కోనసీమ రాజకీయం ఇప్పుడు ఆరని రావణ కాష్టమైంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ జరుగుతున్న పరిణామాలను మౌనంగా పరిశీలిస్తున్నాయి.

English summary
The conflict that arose as the people who had worked together split into two groups turned into a whirlwind.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X