మరో లగడపాటి కాబోతోన్న 'ఆరా' మస్తాన్?

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఒక్కో సంస్థ ఒక్కోలా చెప్పింది. వీరిలో ఆరా మస్తాన్ ప్రెస్ మీట్ పెట్టి పలు విశ్లేషణలు వెల్లడించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 94 నుంచి 104 సీట్లను సాధించి రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. తను చెప్పిన విషయాలపై రాజకీయ విశ్లేషకులు పలు అనుమానాలను, సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీవల్ల మూడు ఎంపీ స్థానాలను వైసీపీ కోల్పోతుందని మస్తాన్ అంచనా వేశారు.

కడపలో లేని ప్రభావం మిగతా చోట్ల ఎలా?
వైఎస్ షర్మిల లాంటి బలమైన నాయకురాలు పోటీలో ఉన్న కడపలోనే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రానప్పుడు మిగతా స్థానాల్లో కాంగ్రెస్ ఎలా ప్రభావం చూపనుందని ప్రశ్నిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రభావం చూపినవారు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ప్రభావం చూపలేకపోయారనేది విషయాన్ని మస్తాన్ మరిచిపోయినట్లున్నారంటున్నారు. ఎవరికి ఓటు వేయాలనే విషయాన్ని ప్రతిఇంట్లో కుటుంబ సభ్యులంతా కూర్చొని మాట్లాడుకుంటారు. ఒక అవగాహనకు వచ్చిన తర్వాత వారు ఓట్లు వేస్తారు.

political analysts questions aara mastan exit poll results

పోలింగ్ శాతం పెరిగితే ప్రతిపక్షానికే అనుకూలం అన్న మస్తాన్
మహిళలు వైసీపీవైపు, పురుషులు టీడీపీవైపు మొగ్గుచూపారని మస్తాన్ చెబుతున్నది ఎంతవరకు నమ్మాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో కంటే పోలింగ్ శాతం పెరిగితే అది ప్రతిపక్షానికి కచ్చితంగా అనుకూలంగా ఉంటుందని ఎన్నికల రోజు ఇదే ఆరా మస్తాన్ చెప్పారు. పోలింగ్ శాతం తగ్గితే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలింగ్ శాతం పెరిగినప్పుడు ఎవరికి అనుకూలమనేది మస్తానే చెప్పాలంటున్నారు.

పోలింగ్ సరళిని విశ్లేషించని 'ఆరా'
తెలంగాణ ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్స్ చేయడం సాధ్యం కాదన్న ఆరా మస్తాన్.. ఇవన్నీ ప్రీ పోల్ సర్వేలే అని స్పష్టం చేశారు. దీన్ని బట్టి ఆయన పోలింగ్ సరళిని విశ్లేషించుకొని చెప్పడంలేదని అర్థమవుతోందనంటున్నారు. మస్తాన్ చెప్పినవి వైసీపీలో ఆనందాన్ని నింపితే, 2014 ఎన్నికల్లో ఇదే మస్తాన్ చెప్పినది తప్పైందంటూ టీడీపీ అభిమానులు ట్వీట్లు పెడుతుననారు. 2014 ఎన్నికల తర్వాత మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎలా అయితే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాడో అలాగే ఇప్పుడు ఆరా మస్తాన్ కూడా ఇచ్చాడని, 2024లో ఆరా మస్తాన్ మరో లగడపాటి రాజగోపాల్ కాబోతున్నారంటూ నెటిజన్ల సెటైర్లు వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+